బరువు తగ్గాలని పొద్దున్న పూట అన్నం తినడం మానేస్తున్నారా? ఐతే జాగ్రత్త..

-

లాక్డౌన్ కారణంగా ప్రతీ ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య ఊబకాయం. బరువు పెరగడం వల్ల నానా ఇబ్బందులు పడుతున్నారు. లాక్డౌన్ లో పెరిగిన బరువుని ఎలా తగ్గించుకోవాలా అని మధనపడుతున్నారు. ఇలా ఆలోచించే చాలా మంది రోజులో ఒకసారి ఆహారం తినకపోవడం బెటరని అనుకుంటున్నారు. ముఖ్యంగా పొద్దున్న పూట బ్రేక్ ఫాస్ట్ వదిలేసి డైరెక్టుగా మధ్యాహ్నాం మాత్రమే తినాలని అనుకుంటున్నారు. ఇలా ఆలోచించే వాళ్ళు తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి.

బరువు తగ్గడానికి ఆహారం మానేయడం అనేది కరెక్ట్ కాదు. మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ కేలరీలు ఉండకుండా చూసుకుంటే బరువు తగ్గుతారు కానీ పూర్తిగా ఆహారమే తినడం మానేస్తే అలసటకి గురై అక్కడే పడిపోతారు. మరీ ముఖ్యంగా పొద్దున్న పూట బ్రేక్ ఫాస్ట్ ఖచ్చితంగా తినాల్సిందే. ఎందుకంటే, రాత్రిపూట పడుకున్నాక ఏడెనిమిది గంటల పాటు కడుపులో ఏమీ ఉండదు. ఇంకా, మధ్యాహ్యం వరకు ఆగితే అప్పుడు టైమ్ మరీ ఎక్కువ అవుతుంది. అలా చేస్తే గ్యాస్ పెరిగే అవకాశం బాగా ఉంది.

పొద్దున్న పూట అన్నం తినడం మానేస్తే చక్కెర శాతం తగ్గుతుంది. దీనివల్ల అనేక ఇతర సమస్యలు పోటెత్తుతాయి. చిరాకు, కోపం తొందర తొందరగా రావడానికి ఇది కూడా ఓ ముఖ్య కారణం. దానివల్ల ఏకాగ్రత లోపించి మనం చేయాలనుకున్న పనులు చేయకుండా అయిపోతాం. పనిచేయడానికి శక్తి రాకపోవడానికి ఇదొక ముఖ్య కారణం. అందుకే మీ డాక్టర్ ని సంప్రదించిన తర్వాతే ఆహారం విషయంలో ఒక నిర్ణయానికి రావాలి. మనల్ని నడిపించే ఆహారాన్ని పక్కన పెట్టడం ఆరోగ్యపరంగా అంత మంచిది కాదు.

Read more RELATED
Recommended to you

Latest news