కొకొనట్‌ బెల్లంపూర్ణాలు

కావలసినవి :
కొబ్బరి తురుము : కప్పు
బెల్లం : కప్పు
ఏలకుల పొడి : 1 టీస్పూన్‌

తయారీ :
బెల్లం గడ్డను ముక్కలుగా చేయాలి. మరుగుతున్న నీటిలో బెల్లంపొడి వేసి కరిగే వరకూ కలబెడుతూ ఉండాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ మీద పాన్‌ పెట్టి తురిమిన కొబ్బరి వేయాలి. ఇందులో బెల్లంసిరప్‌ కూడా వేసి కలుపాలి. చిన్నమంట పెట్టి మిశ్రమం దగ్గర పడేంత వరకు కలబెడుతూ ఉండాలి. మిశ్రమం దగ్గరపడిన తర్వాత పాన్‌ దించేముందు ఏలకులపొడి వేసి కలుపాలి. తర్వాత దించేయాలి. మిశ్రమం కొంచెం చల్లారిన తర్వాత పూర్ణాలుగా గుండ్రటి షేప్‌లో చేసుకుంటే కొకొనట్‌ పూర్ణాలు రెడీ.