సమ్మె కార‌ణంగా.. 3 నిమిషాలకో మెట్రో రైలు..

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ స‌మ్మె చేప‌ట్టిన‌ విష‌యంలో తెలిసిందే. సమ్మెపై ఎవరికి వారు పట్టు వీడ‌ని విక్ర‌మార్కులుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతో సమస్య కొలిక్కిరాలేదు. మరోపక్క సమ్మెపై కార్మి సంఘాల జేఎసీ నేతతలతో కార్మిక శాఖ అధికారులు జరిపిన చర్చలు కూడా విఫలం అయ్యాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌యాణీకుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా ప్రతి మూడు నిమిషాలకో మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. రాజధాని హైదరాబాద్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి 3 నిమిషాలకు ఒక రైలు నడిచేలా చర్యలు తీసుకోనున్నట్టు మెట్రో ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి తెలిపారు.

మెట్రో రైళ్లు ఉదయం 5 గంటలకు బయల్దేరుతాయని.. చివరి రైలు రాత్రి 11.30 గంటలకు బయల్దేరి 12.30 గంటలకు ఇతర టెర్మినల్‌ స్టేషన్లకు చేరేలా ప్రణాళిక రూపొందించినట్టు చెప్పారు. రద్దీని తట్టుకోవడానికి వీలుగా అదనపు టికెట్‌ కౌంటర్లు, యంత్రాలు, సిబ్బందిని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. రద్దీ నిర్వహణ నిమిత్తం ఎల్బీనగర్‌, అమీర్‌పేట్‌, హైటెక్‌ సిటీ, సికింద్రాబాద్‌ ఈస్ట్‌, పరేడ్‌ గ్రౌండ్స్‌ వంటి ముఖ్యమైన స్టేషన్లలో మెట్రో సీనియర్‌ అధికారులు విధులు నిర్వర్తిస్తారని ఎన్‌వీఎ్‌స రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news