మామిడి పండ్లు తినడం వల్ల బరువు పెరుగుతారా?

-

మనం నిత్యం తీసుకునే ఆహారంలో ప్రతీ దానికి పరిమితులు పెట్టుకోవచ్చు. అది తినకూడదు. ఇది తినకూడదు. అది అందుకోసం మంచిది కాదు. ఇది ఇందుకోసం మంచిది కాదు అని చెప్పి పక్కన పెట్టేయవచ్చు. కానీ ఎలాంటి సంకోచం లేకుండ తినాల్సినవి పండ్లు మాత్రమే. అవును, పండ్లు తినడనికి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. ప్రకృతిలో సహజంగా లభించే వాటికి నియమ నిబంధనలు అవసరం లేదు. కానీ కొందరికి కొన్ని సందేహాలున్నాయి. ప్రస్తుతం వేసవి వచ్చేస్తుంది. వేసవిలో నోరూరించే మామిడి పండ్లని తినడానికి అందరూ ఇష్టపడతారు.

చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే, మామిడి పండ్లని తింటే బరువు పెరుగుతారా ?

చాలా మంది ఈ ఉద్దేశ్యంతోనే మామిడి పండ్లకి దూరంగా ఉంటారు. అలాంటి వారు సంవత్సరానికి ఒక్క రుతువులో మాత్రమే అత్యంత ఆవశ్యకమైన మామిడి పండ్లని దూరం చేసుకుంటారన్న మాట.

నిజానికి మామిడి పళ్ళలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ సి, కాపర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీరానికి చాలా అవసరం. ఇందులో ఉండే ప్రోటీన్లు, పీచు పదార్థాలు జీర్ణక్రియని బాగా మెరుగుపరుస్తాయి. దానివల్ల శరీర జీవక్రియ పనితీరు మరింత మెరుగవుతుంది. వీటివల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటుంది.

ఐతే మామిడి పళ్ళని తినడానికి ఒక పద్దతి ఉంది. మామిడి రసం, ఐస్ క్రీమ్, జ్యూస్, వాటి ద్వారా తీసుకుంటే కొవు పెరిగే అవకాశం ఎక్కువ. అలా కాకుండా మామిడి పండుని ముక్కలుగా కత్తిరించుకుని తినాలి. ఇంకో విషయం స్నాక్స్ లా మామిడి ముక్కలని మాత్రమే తినాలి. ఇతర ఆహారంతో పాటు తినకూడదు.

Read more RELATED
Recommended to you

Latest news