జంబూ ఫలం: వేసవిలో దొరికే ఈ పండు గురించి మీకు తెలియని విషయాలు..

ఏ కాలంలో పండే ఆ కాలంలో తినాలని చెబుతుంటారు. కాలానుగుణంగా లభించే పండ్లు రోగనిరోధక శక్తిని బాగా పెంపొదిస్తాయి. అలాగే అనవసరంగా అయ్యే ఆకలిని దూరం పెట్టుతాయి. వేసవిలో దొరికే పండ్ల గురించి మాట్లాడితే అందరూ మామిడి పండ్లనే చెబుతారు. కానీ చాలామందికి పెద్దగా తెలియని మరో పండు ఉంది. అదే వైట్ జామూన్. జంబూ ఫలం. దీన్ని ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తారు. కొందరు వాటర్ ఆపిల్ అని, మరికొదరు వైట్ జామూన్ అని అంటారు.

నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ ఆపిల్ అని పిలుస్తారు. ఐతే దీని వల్ల కలిగే ఉపయోగాల గురించి ఇప్పుడు చర్చిద్దాం.

ఈ పండు గురించి సామాన్య జనాలకి పెద్దగా తెలియదు కానీ, ఆయుర్వేదం, యునానీ, చైనా మెడిసిన్లలో దీన్ని బాగా ఉపయోగిస్తారు. జీర్ణసమస్యలని దూరం చేయడంలో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది. చక్కెర వ్యాధిగ్రస్తులకి ఇది మంచి వరం. రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రించడంలో ఇది సాయపడుతుంది. దీని విత్తనాల్లో కాల్షియం, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే గొంతు సమస్యలు, శ్వాస సంబంధ ఇబ్బందులను దూరం చేస్తుంది.

ఈ పండుని ఎలా తినాలంటే,

ప్రతీ పండుని తినడానికి ఓ పద్దతుంటుంది. కొన్ని పళ్ళని కొన్ని రకాలుగా తింటే మంచి మేలు కలుగుతుంది. ఎలా తినాలో కూడా తెలుసుకోవాలి. ఐతే వైట్ జామూన్ తినడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. సాధారణంగా ఎలా ఉందో అలా తినేయవచ్చు. అలా కాకుండా మీకు బాగా నచ్చే, రోగనిరోధక శక్తిని విపరీతంగా పెంచే సిట్రస్ ఫలాలని ఒక పాత్రలో వేసుకుని దాంతో పాటు జంబూ ఫలాన్ని కలిపి తినవచ్చు.

వేసవిలో మామిడి పండ్లు మాత్రమే తినేవారు ఒక్కసారిఈ జంబూ ఫలాన్ని ట్రై చేయండి. మీరు మళ్ళీ మళ్ళీ తినాలని కోరుకుంటారని చెప్పడంలో ఎవ్వరూ సందేహించరు.