మీ భోజనానికి మరింత రుచిని కలిగించే సాస్ తయారీ.. తెలుసుకుందాం రండి..

Join Our Community
follow manalokam on social media

సోయా సాస్, టమాట సాస్.. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా రకాల సాస్ లు అందుబాటులో ఉన్నాయి. తినే ఆహారానికి మరింత రుచిని కలిగించే సాస్ లని ప్రతీ ఒక్కరూ ఇష్టంగా తింటారు. సాధారణంగా సాస్ తినేవారు బయట భోజనం చేసినప్పుడు మాత్రమే తింటుంటారు. ఇళ్ళలో సాస్ వాడేవారు చాలా తక్కువ మంది. ఒకవేళ వాడినా తయారు చేసుకునే వాళ్ళు ఇంకా తక్కువ. అసలు ఇళ్ళలో తయారు చేసుకుంటే మరింత బాగుంటుందని, చేసుకోవచ్చని తెలియదు కూడా. అందుకే ఈ రోజు మనం సాస్ తయారీ గురించి తెలుసుకోబోతున్నాం. మీ భోజనానికి మరింత రుచిని కలిగించే సాస్ తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం.

చెర్మౌలా సాస్

దీని తయారీకి కావాల్సిన పదార్థాలు..

మిరపకాయ పొడి
ధనియాల పొడి
జీలకర్ర పొడి
కొత్తిమీర
వెల్లుల్లి
నిమ్మ రసం
ఉప్పు
ఆలివ్ ఆయిల్
పచ్చి మిరపకాయలు

తయారీ విధానం

ముందుగా సుగంధ ద్రవ్యాలని వేయించాలి. మిరపకాయల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడిని బాగా వేయించాలి.

ఫుడ్ ప్రాసెస్ ని కలపాలి. ఆ తర్వాత కొత్తిమీర, వెల్లుల్లి, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్, పచ్చి మిరపకాయలు కలపండి.

వాటన్నింటినీ బాగా కలపాలి. ఆ తర్వాత బాగా మిక్సయితే సాస్ లాగా తయారవుతుంది. అప్పుడు చక్కటి సాస్ ని మీకు కావాల్సిన ఆహారాల్లో కలుపుకుని తినవచ్చు.

మీరు ఆహార ప్రియులై, ఆహారంలో కొత్త కొత్త రుచులను కనుగొనాలన్న అభిరుచి మీకుంటే ఈ చెర్మౌలా సాస్ ని ఒక్కసారి ప్రయత్నించండి. మీ భోజనానికి మరింత రుచి కలిగించే ఈ సాస్ మీకు ఆనందాన్ని ఇస్తుంది.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...