రంజాన్ స్పెషల్: ఉపవాసం సమయంలో డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండాలంటే వీటిని తినకండి..!

-

ముస్లింలకు రంజాన్ మాసం అంటే ఎంతో ప్రత్యేకం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు అందరూ కూడా రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండటం వంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వేసవి వచ్చింది. వేసవికాలంలో డీహైడ్రేషన్ కి ఎక్కువ గురవుతూ ఉంటాము. డిహైడ్రేషన్ సమస్య రాకుండా ఉండాలంటే ఉపవాసం చేసేటప్పుడు వీటికి దూరంగా ఉండటం మంచిది.

ముఖ్యంగా వేసవి లో ఉపవాసం ఉండడం అనేది నిజంగా కష్టమైన పని. ఉష్ణోగ్రత తీవ్రంగా ఉంటుంది దీనితో డిహైడ్రేషన్ కి గురవుతూ ఉంటారు. అయితే ఆ బాధ నుంచి కొంచెం ఉపశమనం లభించాలంటే ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.

టీ మరియు కాఫీ :

చాలా మందికి ప్రతిరోజు టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే వీటిని తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు వీటికి దూరంగా ఉండాలి. లేకపోతే కొద్దిగా మాత్రమే తీసుకోండి. పదే పదే ప్రతి రోజు కాఫీలను తీసుకోకండి.

షుగర్ ఎక్కువగా ఉండే పదార్ధాలు:

ఎక్కువ పంచదారతో చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది కాదు. అంటే జిలేబీలు వగైరా వాటికి దూరంగా ఉండండి. వీటిని తీసుకోవడం వల్ల బరువు ఎక్కువగా పెరుగుతూ ఉంటారు. ఒక్కసారిగా ఇది ఎనర్జీ లెవల్స్ ను పెంచి సడన్ గా కిందకి పడేస్తాయి.

పైగా ఎక్కువ ఆకలి కూడా వేస్తుంది. వీటికి బదులుగా మీరు గ్లైసెమిక్ వున్న వాటిని తీసుకోవడం మంచిది అంటే ఓట్స్ గుడ్లు లాంటివి. ఒకవేళ నీకు స్వీట్ అంటే ఇష్టం అయితే వీటికి బదులుగా మీరు ఖర్జూరం, పండ్లు తీసుకోవడం మంచిది. ఎందుకంటే వీటిలో న్యూట్రియాంట్స్ అధికంగా ఉంటాయి.

ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలు:

సమోసాలు, పకోడీలు వంటివి ఎక్కువగా తీసుకోవద్దు. అవి ఆరోగ్యానికి మంచిది కాదు ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల దాహం వేస్తుంది. అలానే ఒంట్లో ఉండే నీళ్ళను కూడా అది బయటకు పంపించేస్తుంది. వాటికి బదులుగా మీరు నీటి శాతం ఎక్కువగా ఉన్న పుచ్చకాయ, కర్బూజ, కీరదోస, టమోటాలు తీసుకోండి.

ఎక్కువ నీళ్లు తాగకండి:

చాలా మంది ఎక్కువగా నీళ్లు తీసుకుంటూ ఉంటారు. అటువంటి అలవాటు ఉంటే మానుకోవడం మంచిది. అలా చేయడం వల్ల ఆహారం ఎక్కువగా తీసుకోవడం కూడా ఎవ్వడు. పైగా ఎప్పుడైనా తింటే కడుపు నిండిపోయినట్లు ఉంటుంది. కాబట్టి విపరీతంగా నీళ్లు తాగే అలవాటు ఉంటే కూడా మానుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news