భోజనం చేసాక చివర్లో తీపి తినాలనుకునే వారికోసం డబల్ చాక్లెట్ కుకీస్.. తయారు చేసుకోండిలా..

-

భోజనం చివర్లో తీపి తింటే అదో తృప్తి. ఆ సంతృప్తిని ఫీల్ అవ్వాలని చాలామంది ప్రయత్నిస్తారు. అలాంటి టైమ్ లో సరైన తీపిపదార్థం దొరకడం అదృష్టమే. ఆ అదృష్టం మీ సొంతం కావాలంటే కొంత సమయం ఇక్కడ వెచ్చించండి. భోజనం చేసాక చివర్లో దొరికే తీపి పదార్థాన్ని ఆస్వాదించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కొంత సమయాన్ని వెచ్చింది హ్యాపీగా ఇంట్లోనే కుకీస్ తయారు చేసుకోవచ్చు. మరెందుకాలస్యం డబల్ చాక్లెట్ కుకీస్ తయారు చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం.

 

డబల్ చాక్లెట్ కుకీస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు

పావు కప్పు వెన్న
పావు కప్పు కోకో పౌడర్
అరచెంచా వెనీలా
అరకప్పు అన్ని అవసరాలకి ఉపయోగపడే పిండి
ముప్పావు కప్పు చక్కెర
పావు కప్పు ఉప్పు
ఒకటిన్నర్ చెంచా పాలు
కొన్ని చాక్లెట్ చిప్స్

తయారీ విధానం

ముందుగా పిండిని తీసుకోవాలి మైక్రోవేవ్ లో కొద్ది సేపు వేడి చేయాలి. అలా కొద్దిసేపయ్యాక పిండి వేగిందని అనుకున్నాక, దానికి కోకో పౌడర్, చక్కెర, ఉప్పు, వెన్న కలపాలి. ఆ తర్వాత పాలు, వెనీలా యాడ్ చేయాలి.

ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఒక పేస్ట్ లాగా తయారు చేయాలి. ఆ తర్వాత చాక్లెట్ ముక్కలని కూడా కలుపుకోవాలి. పేస్ట్ కి చాక్లెట్ కలుపుకుంటే దాని రుచి పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు మీకు కావాల్సిన డబల్ చాక్లెట్ కుకీస్ రెడీ అయిపోయినట్టే. కుకీల లాగా చేసుకుని ఆహారం తిన్న తర్వాత ఆరగించండి.

ఇలా తయారు చేసుకున్న కుకీలని రెండురోజుల్లోగా తినేయాలి. అదీగాక గాలికి పెట్టరాదు. రిఫ్రిజిరేటర్లో మాత్రమే ఉంచాలి. గాలికి పెడితే అవి పాడయిపోతాయి. సో.. మీకు కావాల్సిన డబల్ చాక్లెట్ కుకీస్ రెసిపీ వచ్చేసిందిగా.

Read more RELATED
Recommended to you

Latest news