నువ్వుల లడ్డును ఇలా చేస్తే అస్సలు వదలరు..ఎన్ని లాభాలో..

-

నవ్వులు ఆరోగ్యానికి చాలా మంచివి..ఎక్కువగా తీసుకోవడం వల్ల వేడి అని అంటారు కానీ,లిమిట్ గా తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.నువ్వుల తో చేసే ఏ వంట అయిన కొత్త రుచిని పరిచయం చేస్తుంది.ప్రతి స్నాక్ ఐటమ్ లో ఈ నువ్వులను ఎక్కువగా వాడుతారు. ఇక స్వీట్స్ కూడా కొన్ని ప్రాంతాల్లో చేసుకుంటారు.ఇప్పుడు మనం నువ్వులతో సులువుగా లడ్డును చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం..

కావలసిన పదార్థాలు:

తెల్ల నువ్వులు -ఒక కప్పు

బాదాం పలుకులు – కొన్ని ముక్కలు చేసినవి

బెల్లం -తీపికి సరిపడా

నెయ్యి -రెండు స్పూన్లు

నల్ల నువ్వులు ఉన్నా తీసుకోవచ్చు..మీ చాయిస్

తయారి విధానం:

ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి, నువ్వులను స్విమ్ లో పెట్టి వేయించాలి. నువ్వులు చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకోవాలి. తర్వాత పాన్ లో తురిమిన బెల్లాన్ని వేసుకుని నీరు పోసి.. తీగ పాకం వచ్చే వరకూ బెల్లాన్ని మరిగించి.. దానిలో నువ్వుల పొడి.. బాదాం పలుకులు వేసుకోవాలి. ఈ మిశ్రమం బాగా కలిపి ఉండలు వచ్చేలా అయ్యాక స్టౌ మీద నుంచి దింపేసుకోవాలి.వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చేసుకోవాలి.అంతే లడ్డు రెడీ..ఎన్నో పొషకాలు ఉన్న ఈ లడ్డును రోజు ఒకటి తింటే.. రక్తహీనత, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అలసట, నీరసం వంటివి ఏమీ ఉండవు..జుట్టు సమస్యలు కూడా తగ్గి పోతాయి.మీరు కూడా ట్రై చేయండి..

Read more RELATED
Recommended to you

Latest news