వర్షాకాలం స్నాక్స్: మీ నోటికి రుచిని, శరీరానికి ఆరోగ్యాన్ని అందించే మొలకలు.. తయారు చేయండిలా..

-

వర్షాకాలం సాయంత్రం వేడి వేడి ఆహారాలు నోట్లో పడితే వచ్చే అనుభూతిని అందరూ కోరుకుంటారు. అందుకే రోడ్డు పక్కన పెట్టే చిరుతిళ్ళ వ్యాపారులకి గిరాకీ ఎక్కువ ఉంటుంది. మీకు కూడా ఇలాంటి కోరిక ఉండడం సహజం. కానీ, బయట దొరికే చిరుతిళ్ళలో శుభ్రత ఎంతవరకు అనేది చెప్పలేం. అందువల్ల ఇంట్లోనే తినడానికి ఆలోచిస్తారు. అలాంటప్పుడు మీకిష్టమైన వేడి వేడి చిరుతిళ్ళని ఇంట్లోనే చేసుకోవడం ఉత్తమం. దానికోసం మీరు మొలకలను ప్రయత్నించవచ్చు.

అందులో ఆరోగ్యంతో పాటు మీ నోటికి రుచి కూడా దొరుకుతుంది. ప్రస్తుతం నోటికి రుచి అందించే, శరీరానికి ఆరోగ్యాన్నిచ్చే మొలకలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

దీనికోసం కావాల్సిన పదార్థాలు

పెసర పప్పు మొలకలు- 1 1/2కప్పు
ఉడకబెట్టిన స్వీట్ పొటాటో- అరకప్పు
తరిగిన ఉల్లిపాయలు- 2టేబుల్ స్పూన్లు
అరిగిన టమాటలు- 2టేబుల్ స్పూన్లు
తరిగిన ధన్యాలు- 2టేబుల్ స్పూన్లు
పుదీనా చట్నీ- 2టేబుల్ స్పూన్లు
చింత చట్నీ- 1టేబుల్ స్పూన్
రుచి కోసం ఉప్పు
కావాలంటే పేలాలు

తయారీ పద్దతి:

ఈ పదార్థాలన్నింటినీ ఒకే దగ్గర కలిపి మిక్స్ చేయండి. బాగా మిక్స్ అయ్యాక వేయించిన పేలాలని దానిపై చల్లుకోండి. అంతే మీకు కావాల్సిన మొలకలతో కూడిన ఆరోగ్యకరమైన చిరుతిండి రెడీ అయిపోయినట్టే.

ఒకసారి ప్రయత్నించి చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news