డైట్ లో ఉన్నప్పటికీ తినగలిగే స్ట్రీట్ ఫుడ్ ఏంటో తెలుసా?

-

డైట్ లో ఉన్నప్పుడు స్ట్రీట్ ఫుడ్ Street food తినడం ఆపేస్తారు. చాలాసార్లు తినాలని అనిపించినా డైట్ గుర్తొచ్చి ఆగిపోతారు. కానీ మీకిది తెలుసా? డైట్ లో ఉన్నప్పుడు కూడా తినగలిగే స్ట్రీట్ ఫుడ్ అందుబాటులో ఉంది. స్ట్రీట్ ఫుడ్ అనగానే ఎక్కువ నూనె, ఎక్కువ కేలరీలు మాత్రమే అనుకుంటాం. అందులో కూడా ఆరోగ్యకరమైనవి ఉన్నాయని పట్టించుకోం. అలాంటివి మీ డైట్ ని పాడుచేయకుండా మీ ఆరోగ్యాన్ని మీకిస్తాయి. ఆ ఫుడ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

పన్నీర్ టిక్కా

తందూరీ పన్నీర్ టిక్కా నుండి మసాలా పన్నీర్ టిక్కా వరకు ఏదైనా మీకు రుచి చూడవచ్చు. ఎందుకంటే పన్నీర్ టిక్కాని చాలా తక్కువ ఆయిల్ తో వేయిస్తారు. కొన్నిసార్లు అది కూడా ఉండకపోవచ్చు. పెరుగుతో కలుపుకుని మసాలాలు దట్టించి తయారు చేసుకున్న పన్నీర్ టిక్కాని పుదీనా చట్నీ పక్కన పెట్టుకుని ఆరగిస్తుంటే ఆ మజాయే వేరు.

భేల్ పూరీ

మహారాష్ట్రకి చెందిన భేల్ పూరీ భారతదేశమంతటా దొరుకుతుంది. పేలాలు, ఉల్లి, నిమ్మరసం, చింత చట్నీ కలిపి ఉండే దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. సాయంకాలం సముద్ర తీరాన దొరికే ఈ చిరుతిండిని హ్యాపీగా తినవచ్చు.

మసాలా మొక్కజొన్న

ఉడ్కబెట్టిన మొక్కజొన్న గింజలకి మసాలా దట్టించి కొద్దిగా నిమ్మరసం కలిపి, వర్షం పడుతున్న వేళ చినుకులను చూస్తూ గింజలు నోట్లో వేసుకుంటుంటే తగిలే వెచ్చని వేడి మెదడుకి అదోలాంటి ప్రశాంతతను కలిగిస్తుంది. తక్కువ కేలరీలు కలిగిన ఈ చిరుతిండిని హాయిగా, ఎలాంటి జంకు లేకుండా తినవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news