ప్రపంచ బేకింగ్ దినోత్సవం రోజున అదిరిపోయే కేక్ తయారీ చేసుకోండిలా..

-

బేకరీ ఫుడ్ ఇష్టపడని వాళ్ళు దాదాపుగా ఉండరనే చెప్పాలి. కుకీస్, కేకులు, ఇంకా ఇతర స్నాక్స్ లొట్టలేసుకుని మరీ తింటారు. ఇలా ఇష్టపడేవాళ్ళందరూ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఒకటుంది. ఈ రోజు ప్రపంచ బేకింగ్ దినోత్సవం. అవును, ప్రపంచ వ్యాప్తంగా బేకింగ్ ఆహారంపై ఎక్కువ మందికి తెలియజేసేలా చేయడానికి మే 17వ తేదీని ప్రపంచ బేకింగ్ దినోత్సవంగా జరుపుకుంటారు. బేకింగ్ కి చాలా చరిత్ర ఉంది. క్రీసు పూర్వం 600సంవత్సరాల కాలంలో గ్రీసు ప్రజలు బేకింగ్ విధానాన్ని ఉపయోగించారని చెబుతారు. ఇంకా ఈజిప్షియన్లు బేకింగ్ విధానానికి ఈస్ట్ వాడారని చరిత్ర. మరి ఈ ప్రత్యేకమైన రోజున ప్రత్యేకమైన దాని గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, అది సరికొత్త కేక్ తయారీ గురించైతే ఇంకా అద్భుతంగా ఉంటుంది.

బేకింగ్ దినోత్సవం రోజున ప్రత్యేకమైన కేక్ తయారీ గురించి తెలుసుకుందాం.

కావల్సిన పదార్థాలు

గ్లూటెన్ లేని అన్ని అవసరాలకి పనికొచ్చే పిండి
1కప్పు గ్యాన్యులేట్ స్వీటెనర్
1/4కప్పు కోకో పౌడర్
1టీ స్పూన్ బేకింగ్ సోడా
1/2 టీస్పూన్ ఉప్పు
1టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్
1టేబుల్ స్పూన్ వెనిలా
6టీ స్పూన్ల చక్కెర ఆపిల్ సాస్
1కప్పు నీరు

తయారీ పద్దతి

ముందుగా ఒక పాత్ర తీసుకుని అందులో అన్ని పొడి పదార్థాలను వేసి మిక్స్ చేయండి.
ఇప్పుడు ఆపిల్ సైడర్ వెనిగర్, వెనీలా, చక్కెర లేని ఆపిల్ సాస్ ని బాగా కలపాలి. తర్వాత ఆ పాత్రలో నీళ్ళూ వేసి బాగా కలపాలి. ఒక పేస్ట్ లాగా తయారవుతుంది. ఇప్పుడు కేక్ పాన్ తీసుకుని దాన్లో మనం కలుపున్న వాటిని వేయాలి. 25-30నిమిషాలు బేకింగ్ చేయాలి. ఆ తర్వాత దాన్ని కొద్దిగా చల్లగా అయ్యేవరకు పక్కన పెట్టాలి. అంతే బేకింగ్ డే రోజున మీకు కావాల్సిన కేక్ తయారీ అయినట్టే.

Read more RELATED
Recommended to you

Latest news