యాభైకి చేరువవుతున్న మహిళలు తీసుకోవాల్సిన ఆహారాలు..

-

మహిళల శరీరానికి పురుషుల శరీరానికి చాలా తేడా ఉంటుంది. అందుకే ఆరోగ్యంలోనూ ఇద్దరికీ తేడాలుంటాయి. కాబట్టి తీసుకునే ఆహారంలో విభిన్నత ఉంటుంది. ఒక్కొక్కరికీ ఒక్కో అవసరాన్ని బట్టి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వయసు పెరుగుతున్న కొద్దీ ఆహారంలో మార్పులు జరుగుతూ ఉండాలి. వయసు శరీరంలో రకరకాల మార్పులని తీసుకొస్తుంది. ఆ మార్పులని తట్టుకుని ఆరోగ్యంగా నిలబడడానికి ఏం చేయాలో తప్పకుండా తెలుసుకోవాలి. ముఖ్యంగా యాభైకి చేరువవుతున్న మహిళలు ఆహారం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి.

యాభైకి చేరువవుతున్న మహిళలు తీసుకోవాల్సిన ఆహారాలేంటో ఇక్కడ చూద్దాం.

ఫైబర్ ఎక్కువగా గల ఆహారాలు

వయసు పెరుగుతున్న కొద్దీ జీర్ణాశయ పనితీరు తగ్గుతుంది. అందువల్ల మహిళలు తీసుకునే ఆహారంలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉండాలి. దీనివల్ల జీర్ణాశయం పనితీరు మెరుగుపడుతుంది.

బీ12 విటమిన్

కడుపులో ఉండే ఆమ్లాలు మనం తీసుకున్న ఆహారాల నుండి విటమిన్ బీ 12ని ఉత్పత్తి చేస్తాయి. వయసు పెరుగుతున్న కొద్దీ ఆ ఆమ్లాలు తగ్గుతాయి. అప్పుడు బీ 12ఉత్పత్తి కాదు. దానివల్ల నాడీవ్యవస్థ దెబ్బతింటుంది.

పసుపు, దాల్చిన చెక్క

వయసు పెరుగుతుంటే లాలాజలం తగ్గిపోతుంది. అపుడు సుగంధ ద్రవ్యాల ఆవశ్యకత ఎంతో ఉంది. పసుపు రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా కీళ్ళవ్యాధులు రాకుండా ఉంచుతుంది. దాల్చిన చెక్కని వాడడం వల్ల శరీరంలో రక్తంలో చక్కెర శాతం నియంత్రణలో ఉంటుంది.

మంచినీరు

వృద్ధాప్యం దగ్గర పడుతున్న కొద్దీ శరీరంలో నీటిశాతం తగ్గుతూ వస్తుంది. అందుకే మహిళలు కనీసం 8గ్లాసుల నీటిని తాగాలి. అదే పురుషులైతే కనీసం 13గ్లాసుల నీళ్ళు తాగాలి. ఫిజికల్ గా ఎక్కువ పని చేస్తుంటే ఇంకా ఎక్కువ తాగాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news