పాలు, కొబ్బ‌రి పాయ‌సం.. చేసేద్దామా..!

-

పుట్టిన రోజైనా.. ఏదైనా శుభ‌వార్త విన్నా.. శుభ‌కార్యం త‌ల‌పెట్ట ద‌లిచినా.. పెళ్లి రోజైనా.. మ‌రే ఇత‌ర శుభ దిన‌మైనా స‌రే.. మన తెలుగు ఇండ్ల‌లో మొద‌టగా గుర్తుకు వ‌చ్చేది పాయ‌సం. పెద్ద‌గా క‌ష్ట‌ప‌డాల్సిన ప‌నిలేకుండానే తియ్య తియ్య‌ని పాయ‌సాన్ని చేసుకుని వేడి వేడిగా లాగించేయ‌వ‌చ్చు. ప్ర‌తి శుభ సంద‌ర్భాన్ని మ‌న వాళ్లు పాయ‌సంతో మొద‌లు పెట్టి జ‌రుపుకుంటారు. అయితే దాన్నే ఇంకాస్త రుచిక‌రంగా చేసుకోవ‌చ్చు. అదెలాగంటే..

పాలు, కొబ్బ‌రి పాయ‌సం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు:

తాజా కొబ్బ‌రి తురుము – 1 క‌ప్పు
చ‌క్కెర – 3/4 క‌ప్పు
పాలు – 1/2 క‌ప్పు
బియ్యం – 2 టేబుల్ స్పూన్లు
యాల‌కుల పొడి – 1/2 టీస్పూన్
నెయ్యి – 1 టీస్పూన్
బాదం ప‌ప్పు (త‌రిగిన‌వి) – త‌గిన‌న్ని

పాలు, కొబ్బ‌రి పాయ‌సం త‌యారు చేసే విధానం:

ముందుగా బియ్యాన్ని 2 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత అందులో కొబ్బ‌రి తురుం వేసి మెత్త‌గా ప‌ట్టుకోవాలి. ఒక గిన్నెలో ఈ మిశ్ర‌మాన్ని తీసుకుని ఉడ‌క‌బెట్టాలి. ఈ మిశ్ర‌మం ఉడుకుతున్న‌ప్పుడే అందులో చ‌క్కెర‌, పాలు పోసి బాగా క‌ల‌పాలి. పాయ‌సం చిక్క‌బ‌డుతున్న‌ప్పుడు అందులో యాల‌కుల పొడి, నేతిలో వేయించిన బాదం పప్పు వేసి దింపాలి. అంతే.. వేడి వేడి పాలు, కొబ్బ‌రి పాయ‌సం త‌యార‌వుతుంది. దీన్ని వేడిగా తింటే ఎంతో మ‌జాగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news