సగ్గుబియ్యంతో బర్ఫీ.. క్షణాల్లో టేస్టీ స్వీట్‌ రెడీ..!

-

సగ్గుబియ్యంతో పాయసం, కిచిడి చేసుకుంటారు. సగ్గుబియ్యంలో కాలరీలు తక్కువగా ఉంటాయి. అయితే స్వీట్స్‌లో బర్ఫీలు గురించి మీ అందిరికీ తెలిసే ఉంటుంది. కానీ వాటిల్లో షుగర్‌ విపరీతంగా వాడతారు. ఆరోగ్యానికి అంత మంచిది కాదు. సగ్గుబియ్యంతో సాబుదానా బర్ఫీ ఎలా చేయాలో ఈరోజు చూద్దామా..!

సాబుదానా బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..

సగ్గుబియ్యం అరకప్పు
ఎర్రగోధుమరవ్వ అరకప్పు
పాలు రెండుకప్పులు
తేనె ఒక కప్పు
జీడిపప్పు ముక్కలు రెండు టేబుల్‌ స్పూన్స్‌
బాదంపప్పు ముక్కలు రెండు టేబుల్‌ స్పూన్స్‌
యాలకల పొడి ఒక టీ స్పూన్

తయారు చేసే విధానం..

ముందుగా చిన్న నాన్‌స్టిక్‌ పాత్ర తీసుకుని స్టవ్‌మీద పెట్టి అందులో మీగడ వేసి బాదం, జీడిపప్పు ముక్కలను వేపించి పక్కనపెట్టుకోండి. అదే పాత్రలో సగ్గుబియ్యం, గోధుమరవ్వ వేసి దోరగా వేడెక్కనివ్వండి. అలా వేడిచేసుకున్న వాటిని మిక్సీ జార్‌లో వేసుకుని మెత్తగా గ్రైండ్‌ చేసుకోండి. మళ్లీ ఈ పొడిని లైట్‌గా వేడిచేసుకోండి. ఇది వేడెక్కిన తర్వాత పాలు మెల్లగా ఉండలుకట్టకుండా పోయండి. సిమ్‌లో పెట్టి పాలతో ఆ పిండి ఉడికేలా ఉంచండి. నీటి శాతం తగ్గాక..అప్పుడు అందులో తేనె వేయండి. బాగా తిప్పుతూ ఉండండి. హల్వాలా అవుతుంది.అలా వచ్చాక అందులో వేయించుకున్న బాదం, జీడిపప్పు ముక్కలు, యాలుకల పొడి వేసి తీసేయండి. బటర్‌ పేపర్‌ వేసి అందులో మీగడ రాసి ట్రేలో పెట్టి ఇంకో ప్లేట్‌లో వేసి మనకు కావాల్సిన షేప్‌లో కట్‌ చేసుకుంటే సరి..! ఎంతో రుచికరమైన బర్ఫీ రెడీ. షుగర్‌ లేదు కాబట్టి..మీ ఇష్టం ఎంతైనా తినొచ్చు. చిన్నపిల్లలకు ఇలాంటివి చేసి పెడితే.. హ్యాపీగా లాగించేస్తారు. ఈ సారి మీరు కూడా ట్రై చేయండి.!

Read more RELATED
Recommended to you

Latest news