సమ్మర్ స్పెషల్ రాగి పిండి బటర్ మిల్క్… ఎలా చేయాలో తెలుసా?

-

పెరుగు, రాగి పిండి, ఉప్పు, పూదీన ఆకులు, చిన్న ముక్కలుగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, చాట్ మసాలా, నీళ్లు ఉంటే చాలు రాగి బటర్ మిల్క్ తయారు చేయొచ్చు.

రాగి పిండితో బటర్ మిల్కా? అని నోరెళ్ల బెట్టకండి. రాగిలో ఉన్న సుగుణాలు తెలిస్తే రాగి పిండిని అలాగే బుక్కేసినా బుక్కేస్తారు మీరు. అని సుగుణాలు ఉంటాయి రాగి పిండిలో. ఎముకలు దృఢంగా ఉండాలనుకునే వాళ్లకు రాగి బెస్ట్ ఆప్షన్. అందులో ఉంటే కాల్షియం ఎముకలను దృఢపరుస్తుంది.

summer special ragi flour buttermilk

సాధారణంగా దొరిగే రాగులను పిండిగా పట్టించుకొని దాన్ని ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. తృణ ధాన్యాల్లో ఒకటైన రాగులు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఎండాకాలం రాగులను మీ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. దీంట్లో కార్బోహైడ్రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. మరి.. ఇన్ని సుగుణాలు ఉన్న రాగి పిండితో బటర్ మిల్క్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

పెరుగు, రాగి పిండి, ఉప్పు, పూదీన ఆకులు, చిన్న ముక్కలుగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, చాట్ మసాలా, నీళ్లు ఉంటే చాలు రాగి బటర్ మిల్క్ తయారు చేయొచ్చు.

ముందుగా పెరుగును ఒక గిన్నెలో తీసుకొని దాన్ని బాగా చిలకండి. పెరుగు మరీ గట్టిగా ఉంటే కొన్ని నీళ్లు కలపండి. ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టండి. పచ్చి మిర్చి, అల్లం ముక్కలు, పూదీన ఆకులు(కొన్ని గార్నిష్ చేయడానికి ఉంచుకోండి) తీసుకొని వాటిని గ్రైండ్ చేయండి. ఆ మిశ్రమాన్ని పెరుగులో కలుపుకొని.. దాంట్లో కొంచెం ఉప్పు వేసి కొన్ని నీళ్లు కలపండి. టేస్టీ బటర్ మిల్క్ రెడీ అయినట్టే. దాన్ని పక్కన బెట్టండి.

ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో రాగి పిండి వేసి దాంట్లో కొన్ని నీళ్లు పోసి బాగా కలపండి. పాన్ తీసుకొని కొన్ని నీళ్లు పోసి ఆ నీటిని కాగబెట్టండి.

బాగా కాగిన నీటిలో రాగి పిండిని వేసి బాగా కలపండి. మిశ్రమం మరీ గట్టిగా ఉండకుండా.. కొంచెం జ్యూస్ లా ఉండాలి. దాన్ని పక్కన పెట్టి అది చల్లారేదాక వెయిట్ చేయండి. తర్వాత ఆ మిశ్రమంలో కొంచెం ఉప్పు వేసి.. సిద్ధం చేసిన బటర్ మిల్క్ ను వేసి బాగా కలపండి. దాన్ని గ్లాస్ లో పోసుకొని కొంచెం చాట్ మసాలా, పూదీనా ఆకులు వేసుకొని రాగీ బటర్ మిల్స్ ను లాగించేయండి. ఎండాకాలంలో ఇది చాలా సలువ.

Read more RELATED
Recommended to you

Latest news