సమోసాలు భారతదేశ వ్యాప్తంగా అందరూ తినే చిరుతిళ్ళు. సాయంకాలమైతే చాలు ఏదైనా తినాలని అనిపించినపుడు చాలా మంది చూసే ఆప్షన్ సమోసానే. అందుకే ఇందులో వెరైటీలు ఎక్కువ. కార్న్ సమోస, కూర సమోస, ఆనియన్ సమోస.. ఇంకా చాలా. అందులో భాగంగానే సమోస పోహా అనే కొత్త వెరైటీ వచ్చింది. మహమ్మారి సమయంలో బయటకు వెళ్ళే అవకాశం తక్కువ కాబట్టి, ఇంట్లోనే ఉండి పోహా సమోసని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి.
దీనికి కావాల్సిన పదార్థాలు
అటుకులు- అరకప్పు
కారం- టేబుల్ స్పూన్
అల్లం పేస్ట్- 1స్పూన్
నూనె-1స్పూన్
మైదా పింది- 1కప్పు
బంగాళ దుంప- 2
జీలకర్ర- 2స్పూన్
కావాల్సినంత ఉప్పు
వాము- 1/2కప్పు
స్టెప్ 1
ముందుగా అటుకులని కడిగి పక్కన పెట్టాలి. ఆ తర్వాత బంగాళదుంపలను ముక్కలుగా చేసి మరిగించాలి. మరిగిన తర్వాత పక్కకు తీసి గుజ్జు చేయాలి.
స్టెప్ 2
కారం, జీలకర్ర, అల్లం, ఉప్పు మొదలగు వాటిని పోహాకి జోడించండి. దానికంటే ముందు పోహాను బంగాళ దుంప గుజ్జును ఒకే దగ్గర కలిపి మిశ్రమం లాగా చేయండి.
స్టెప్ 3
సమోసాల కోసం పిండిని రెడీ చేసుకుని వాటిని శంఖు ఆకారంలో కత్తిరించండి. ఆ తర్వాత బంగాళ దుంప, పోహా మిశ్రమాన్ని ఆ శంఖు ఆకారంలో కూర్చండి.
స్టెప్ 4
వీటిని నూనెలో వేయించకుండా ఎయిర్ ఫ్రైయర్ లో 180 డిగ్రీల సెల్సియస్ వద్ద 5 నిమిషాలు ముందుగా వేడి చేయండి. 5నిమిషాల తర్వాత వాటిని బయటకు తీసి మైక్రోవేవ్ ఓవెన్ లో కాల్చండి.
ఆ తర్వాత పుదీనా చట్నీ లేదా చింతకాయ చట్నీతో ఆరగించండి.