ప్రోటీన్ శరీరానికి ఎంతో అవసరం. శరీరంలో కణాలు ఏర్పడడానికి ప్రోటీన్ ఆవశ్యకత ఎంతో ఉంది. కణాలని, కణజాలాలని మరమ్మత్తు చేయడానికి ప్రోటీన్ చాలా అవసరం. ఐతే జంతువుల నుండి లభించే ప్రోటీన్ శరీరానికి మేలు చేస్తుందని చాలా మంది చెబుతుంటారు. మరి చికెన్, చేపలు, మాంసం మొదలగు వాటిల్లో ఏ ప్రోటీన్ ఉత్తమమైందో తెలుసుకోవాలి.
చికెన్ లో ప్రోటీన్ శాతం చాలా ఎక్కువ. కానీ ఏదైనా మరీ ఎక్కువ తినకూడదని గ్రహించాలి. ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉన్న చికెన్ తినడానికి అందరూ ఇష్టపడతారు. కానీ ఫౌల్ట్రీ ఫాంలో పెంచే కోళ్ళకి ఇచ్చే మందుల కారణంగా చికెన్ కి దూరంగా ఉండాలని చూసి ప్రోటీన్ కి దూరంగా ఉంటున్నారు. ఆరోగ్యకరమైన చికెన్ శరీరానికి మంచి ప్రోటీన్ అందిస్తుంది. ఇంజెక్షన్లు వంటివి ఇవ్వడం వలన కోళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాన్ని తెస్తాయి. కానీ వాటిని ఆహారంగా తీసుకునే వాళ్ళకి నష్టాన్ని చేకూరుస్తాయి.
చేపలని కూడా దాదాపుగా ఇలాగే పెంచుతారు. చేపల చెరువుల్లో మందు పదార్థాలు వంటివి కలపడం, దిగుబడి ఎక్కువ రావడానికి రసాయనాలు వాడటం చేస్తుంటారు. అందువల్ల చేపలు తినాలనుకుంటే మంచినీటి చేపలకి ప్రాముఖ్యత ఇవ్వడం బెటర్. మరో ముఖ్య విషయం ఏమిటంటే, సముద్రంలో దొరికే చేపల్లో లోహాలు ఉంటాయి. ఆర్సెనిక్, పాదరసం వంటివి ఉంటాయి. అందుకే చేపలని అధికంగా తినేవారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
ఇకపోతే మాంసం.. మాంసం శరీరానికి చాలా మేలు చేస్తుంది. అందరూ అనుకుంటున్నట్టు ఇది కొవ్వును పెంచదు. కొవ్వును కరిగిస్తుంది. ఇందులో ఉండే స్టెరిక్ ఆమ్లం కొవ్వును కరింగించేందుకు ఉపయోగపడుతుంది. సో ప్రోటీన్లు కలిగిన మాంసం తినాలనుకున్నవారు పై విషయాలు గుర్తుంచుకోండి.