ట్రెడిషనల్ లుక్​లో శ్రీలీల మెస్మరైజింగ్ ఫొటోలు

-

టాలీవుడ్​లో మోస్ట్ హాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో తన ఫొటోలు పోస్టు చేసింది. వరుస సినిమా షూటింగులతో బిజీబిజీగా ఉంటున్న ఈ బ్యూటీ చాలా గ్యాప్ తర్వాత నెట్టింట కమ్ బ్యాక్ ఇచ్చింది. తాజాగా ఈ భామ ఎల్లో కలర్ చుడీదార్​లో సందడి చేసింది. ఈ ఫొటోల్లో శ్రీలీల చాలా అందంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇటీవలే ఈ బ్యూటీ విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న చిత్రానికి సంబంధించి జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొంది. ఈ వేడుకలో శ్రీలీల ట్రెడిషనల్ లుక్​లో కనిపించి సందడి చేసింది. ఆ లుక్​కు సంబంధించిన ఫొటోలనే తాజాగా నెట్టింట షేర్ చేసింది. ఈ ఫొటోల్లో శ్రీలీల క్యూట్ క్యూట్ ఎక్స్​ప్రెషన్స్​తో మెస్మరైజ్ చేసింది. తన అందంతో అభిమానులను కట్టిపడేసింది.

శ్రీలీల ప్రస్తుతం అరడజనుకుపైగా సినిమాలతో బిజీగా ఉంది. మహేశ్ బాబుతో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. అంతే కాకుండా బాలకృష్ణ మూవీలో, బోయపాటి-రామ్ కాంబోలో వస్తున్న మరో సినిమాలో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news