ఆ ఊరిలో ఒక్క పురుగు కూడా ఉండదు..ప్రేతాత్మాలు తిరుగుతాయని ప్రచారం.. ఎక్కడో తెలుసా?

-

ఒక్కో ఊరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.. కొన్ని ప్రాంతాలకు అంతు చిక్కని మిస్టరీలు కూడా ఉంటాయి.. ప్రశాంతంగా ఉండే ఒక ఊరిలో అస్సలు మనుషులు ఉండరు.. అసలు కారణం ఏంటి..ఎందుకు ఆ ప్రాంతం నిర్మానుష్యమైందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

మిస్టరీగా మిగిలిపోయిన ఆ ఊరు మన దేశంలోనే ఉంది..ఆ ఊరి పేరే కుల్‌ధారా. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ జిల్లాలో ఉన్న ఈ ఊరిలో మనుషులు లేకపోగా.. ప్రేతాత్మలు ఉన్నాయనే వదంతులు ఉన్నాయి. 13వ శతాబ్దం నాటికి ఈ ఊరిలో పాలీవాల్‌ బ్రహ్మణులు ఉండేవారు. 19వ శతాబ్దం ప్రారంభంలో ఆ ఊరిలోని మనుషులంతా.. వేర్వేరు చోట్లకు వెళ్లిపోయారు. అలా చూస్తూ చూస్తూ ఉండగానే.. కొన్ని రోజులకే మొత్తం ఊరు ఖాళీ అయ్యింది. అయితే ఊరి జనాలు ఖాళీ చేసి వెళ్లిపోవడానికి దారితీసిన పరిస్థితులపై స్పష్టమైన సమాచారం ఇప్పటి వరకు లేదు. ఆ ఊరిని మనుషులు విడిచి పెట్టడానికి గల కారణంపై రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి.

విషయానికొస్తే.. అప్పటి జైసల్మేర్‌ మంత్రి సలీం సింగ్‌.. కుల్‌ధారాలో అరాచాకాలకు పాల్పడేవాడని, అతడి ఆకృత్యాలను భరించలేకనే జనాలు ఆ ఊరు ఖాళీచేసి వెళ్లిపోయారని చుట్టు పక్కల గ్రామాల వారు చెబుతుంటారు. ఊరు నిర్మానుష్యంగా మారిన తర్వాత, ఆ ఊరిలో ప్రేతాత్మలు సంచరిస్తున్నాయనే వదంతులు వ్యాప్తిలోకి వచ్చాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా చాలా కాలం ఏ ప్రభుత్వం కూడా ఆ ఊరిని పట్టించుకోలేదు. చివరకు 2010లో రాజస్థాన్‌ ప్రభుత్వం కుల్‌ధారా గ్రామాన్ని టూరిస్ట్‌ ప్లేస్‌గా మార్చాలని నిర్ణయం తీసుకుంది.. కానీ అన్నీరకాల సదుపాయాలు లేకపోవడంతో అక్కడికి పెద్దగా పర్యాటకులు రాలేదని తెలుస్తుంది.. కానీ జనాలు ఇప్పటికి అక్కడకు రాకపోవడం విశేషం..

Read more RELATED
Recommended to you

Latest news