హీరోయిన్ రితికా సింగ్ గుర్తుందా మీకు. వెంకటేశ్ హీరోగా వచ్చిన గురు సినిమాలో లేడీ బాక్సర్‌గా హల్ చల్ చేసింది కదా. ఆ సుందరే. ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక్క ఫోటో షేర్ చేసి సోషల్ మీడియాలను షేక్ చేస్తోంది. అవును.. మామూలుగా కాదు. నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తోంది.
రీసెంట్ గా ఓ ఫోటోషూట్‌లో పాల్గొన్నదట రితికా సింగ్. ఈ సందర్భంగా ఎద అందాలు కనిపించేలా డ్రెస్సు వేసుకున్న రితికా.. తన అందాలను ఆరబోసింది. ఓపెన్ క్లీవేజ్ టైప్‌లో ఉండే డ్రెస్ వేసుకొని కుర్రకారు మతి పోగొడుతోంది. ఆ ఫోటోను చూసి ఆమె ఫాలోవర్లు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. రితికాకు ఏమైంది. ఇంతలా గ్లామర్ డోస్‌ను పెంచుతోందెందుకు? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
రితికా సింగ్ తెలుగులో గురు సినిమాలో నటించింది. కోలీవుడ్‌లో ఇరుదిచుట్రు అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీకి వచ్చింది. ఈ అమ్మడు నిజంగానే బాక్సరట. అందుకే.. ఇరుదిచుట్రు అనే సినిమాలో బాక్సర్ పాత్రలో రితికాను సెలెక్ట్ చేసుకున్నారు.
అదే సినిమా తెలుగులో గురుగా రీమేక్ అయింది. గురులోనూ ఆ పాత్రకు రితికానే తీసుకున్నారు. తర్వాత తమిళంలో శివలింగ, ఆండవన్ కట్టలై సినిమాల్లో నటించింది. ఆ రెండు కూడా హిట్ అయినా.. రితికాకు మాత్రం ఆఫర్లు రావట్లేదట. ప్రస్తుతం వనంగాముడి అనే సినిమాలో నటిస్తోంది. మరి.. ఆఫర్ల కోసం ఇలా గ్లామర్ డోస్ పెంచిందా రితికా? అంటూ నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు.