అలాంటి అబ్బాయిలంటే అసహ్యం అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన సాయి పల్లవి.. కారణం..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్ల కంటే సాయి పల్లవి కొంచెం విభిన్నంగా ప్రవర్తిస్తూ.. మనసుకు నచ్చిన పాత్రలు మాత్రమే ఎంచుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కథ నచ్చక పోయినా.. పాత్ర ఇబ్బంది పెట్టినా.. పారితోషికం ఎక్కువ ఇస్తామని చెప్పినా.. రీమేక్ సినిమాలు అయితే నిర్మొహమాటంగా రిజెక్ట్ చేస్తూ ఉండడం గమనార్హం . అందుకే యువత లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది సాయిపల్లవి. ముఖ్యంగా సాయి పల్లవి డ్రెస్సింగ్ సెన్స్ కు , డాన్స్ కు అమ్మాయిలు కూడా ఊహించిన స్థాయిలో అభిమానులుగా మారిపోయారు.

ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారు అనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసింది.. ఇకపోతే అబ్బాయిలు ఇలాగే ఉండాలని నిబంధన తనకు లేదని అయితే సెన్సిటివ్ గా ఉండే అబ్బాయిలను తాను ఎక్కువగా ఇష్టపడతాను అని ఆమె చెప్పుకొచ్చింది. ఇక సెన్సిటివ్ గా ఉండే అబ్బాయిలు మనస్ఫూర్తిగా ఏదైనా చెబితే తనకు ఇష్టమని ఆమె వెల్లడించారు. అబ్బాయిలు ఏదైనా విషయం గురించి వెంటనే స్పందించి ఏడిస్తే తనకు నచ్చుతారు అని ఆమె వెల్లడించింది. అదే అబ్బాయిలు మ్యాచో గా ఉంటే తనకు నచ్చదని అసహ్యం అని అమ్మాయిలను హార్ట్ చేయకూడదని భావించి.. అబ్బాయిలు చేసే ప్రయత్నాలు తనకు నచ్చుతాయని ఆమె తెలిపింది.అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలనే ఆలోచనతో కండలు పెంచే అబ్బాయిలు తనకు అస్సలు నచ్చదు అని తెలిపింది. ఇక ఎవరైనా సరే లవ్ ప్రపోజ్ చేసిన సమయంలో మనసుకు నచ్చితే చాలని బంగారంతో చేసిన ఉంగరాలు, రోజాపూలు ఇచ్చి ప్రపోజ్ చేయాల్సిన అవసరం లేదని ఆమె తెలిపింది . ఇక సాయిపల్లవి చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి

Read more RELATED
Recommended to you

Latest news