పట్టు పరికిణి కట్టి వచ్చెనే సంక్రాంతీ.. మైక్ టీవీ సంక్రాంతి పాట

రంగుల పుట్టిల్లూ.. తెలుగూ లోగిళ్లూ
ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లూ..
కురిసె మంచు జల్లూ.. తెరిచె పూల కళ్లూ..
గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లూ..
పట్టు పరికిణి కట్టి
సుక్కల వరసలు పెట్టి
సక్కని ముగ్గులు కట్టి..
వచ్చెనే సంక్రాంతీ..
అంటూ సాగుతుంది సంక్రాంతి పాట. మైక్ టీవీ ప్రతి పండుగకు.. ఆ పండుగ ప్రాశస్త్య్రం గురించి పాట రూపంలో వినిపిస్తుంది. సంక్రాంతికి కూడా మిట్టపల్లి సురేందర్ రాసిన అద్భుతమైన లిరిక్స్‌తో మంగ్లీ, హన్మంత్ యాదవ్ పాడిన సంక్రాంతి పాటను మైక్ టీవీ తాజాగా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది.