బోరు పైపు నుంచి ఐస్ గడ్డలు.. ఎక్కడో తెలుసా?

-

Ice cubes from bore pipe video goes viral

బోరు పైపు నుంచి ఐస్ గడ్డలు వస్తున్నాయి. అవును.. అసలే ఇది చలికాలం. సిటీల్లోనే చలి వణికిస్తుంటే.. ఊళ్లలో, పొలాల దగ్గర ఇంకెంత చలి ఉండాలి. ఆ చలికి నీళ్లు కూడా గడ్డ కట్టుకుపోయి.. ఇదిగో ఇలా పైపుల నుంచి ఐస్ గడ్డలు వచ్చాయి. అయితే.. ఈ ఘటన తెలంగాణలోని ఆదిలాబాద్‌లో జరిగిందని… ఓ రైతు పొద్దున్నే మోటరు వేయడానికి తన పొలానికి వెళ్లాడని.. మోటర్ వేయగానే ఇదిగో ఇలా పైపు నుంచి ఐస్ గడ్డలు వచ్చాయని సోషల్ మీడియాలో వార్త వైరల్ అయింది. దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. ఆ వీడియో నిజమైనదే కానీ.. అది జరిగింది ఆదిలాబాద్‌లో కాదు.. హర్యానాలో చోటు చేసుకున్నది ఆ ఘటన. నార్త్ ఇండియాలో చలి ఎక్కువగా ఉంటుంది తెలుసు కదా. చలికి పైపులోని నీళ్లు గడ్డకట్టి అలా ఐస్ గడ్డలు బయటికి వచ్చాయటన్నమాట. అది అసలు విషయం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. ఎవరికి నచ్చిన పేరు వాళ్లు పెట్టుకొని ఇది అక్కడ జరిగింది.. ఇక్కడ జరిగింది అంటూ పోస్టులు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news