రోజ్‌ వాటర్‌ తాగడం వల్ల ఎన్నో లాభాలు.. కాలేయ సమస్యలుంటే కచ్చితంగా తాగాల్సిందే.!!

-

చాలామంది అమ్మాయిలు రోజ్‌ వాటర్‌ను వాడతారు. డైలీ ఫేస్‌కు రోజ్‌ వాటర్‌ అప్లై చేయడం వల్ల ముఖం అందంగా ఉంటుంది. చర్మ సౌందర్యానికి మాత్రమే రోజ్‌ వాటర్‌ను ఉపయోగిస్తారు.. కానీ రోజ్‌ వాటర్‌ను తాగొచ్చు తెలుసా..? రోజ్‌ వాటర్‌ను వంటల్లో కూడా వాడతారు. ముఖ్యంగా హోటల్స్‌లో చేసే బిర్యానీల్లో వాడతారు. రోజ్ వాటర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దామా..!

మెదడుకు మేలు చేస్తుంది- రోజ్ వాటర్ అధిక టెన్షన్ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కారణం లేకున్నా, అవసరంకాకున్నా.. చాలామంది ఎక్కుగా టెన్షన్‌ పడుతుంటారు. అలాంటివారు రోజ్‌ వాటర్‌ తాగితే..ఇందులో ఉండే గుణాలు ఒత్తిడిని తగ్గించి అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.

గొంతు శుభ్రం- గొంతు నొప్పి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా రోజ్ వాటర్ తాగడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. రోజ్ వాటర్‌లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అధిక పరిమాణంలో ఉంటాయి.. కాబట్టి గొంతు నొప్పి ఇతర అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.

పొట్టకు మేలు- రోజ్ వాటర్ తాగడం వల్ల పొట్టకు చాలా మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నరు. ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియను బలంగా చేస్తాయి. ఇందుకోసం రోజ్ వాటర్‌తో తయారుచేసిన హెర్బల్ టీని రోజూ తాగవచ్చు.

కాలేయ సమస్యల నుంచి ఉపశమనం- ఈరోజుల్లో కాలేయ సమస్యలతో చాలా మంది ఇబ్బందిపడుతున్నారు. టేస్ట్‌గా ఉందని ఫాస్ట్‌ ఫుడ్స్‌ ఎక్కువగా తినడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే.. రోజ్‌ వాటర్‌ను ప్రతి రోజూ తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. కాలేయం దెబ్బతినే ప్రమాదం కూడా తగ్గుతుంది.

రోజ్‌వాటర్‌ను తాగొచ్చు అన్నారు కదా అని మార్కెట్‌లో దొరికేది ఏది పడితే అది తాగేయకండి..! ప్యూర్‌ రోజ్‌ వాటర్‌ మార్కెట్‌లో అంత ఈజీగా ఉండదు. స్మెల్‌ కోసం అందులో రసాయనాలు కలుపుతారు. మీరే ఇంట్లో తయారు చేసుకుని తాగడం ఉత్తమం..!

Read more RELATED
Recommended to you

Latest news