రేవంత్ పాదయాత్రకు బ్రేకులు..సీనియర్లు తగ్గట్లేదు.!

-

టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య ఆధిపత్య పోరు పెద్ద ఎత్తున నడుస్తున్న విషయం తెలిసిందే. ఎలాగైనా రేవంత్ రెడ్డిని పి‌సి‌సి పదవి నుంచి తప్పించాలని సీనియర్లు గట్టిగా ట్రై చేస్తున్నారు. ఇటు సీనియర్లకు చెక్ పెట్టాలని రేవంత్ చూస్తున్నారు. ఇదే క్రమంలో ఇటీవల పదవుల పంపకాల విషయంలో రచ్చ జరగడంతో..దిగ్విజయ్ సింగ్ వచ్చి..సరి చేయడానికి చూశారు..కానీ వివాదం సర్దుకున్నట్లు కనిపించడం లేదు.

పైకి విమర్శలు చేయడం ఆపారు కానీ..లోపల మాత్రం వారి మధ్య పోరు నడుస్తున్నట్లే కనిపిస్తోంది. ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు. కానీ రేవంత్ పాదయాత్రతో తమకు సంబంధం లేదని సీనియర్లు చెబుతున్నారు. రేవంత్ పాదయాత్రకు ఏ మాత్రం సహకారం అందించకూడదు అనే కాన్సెప్ట్‌లో సీనియర్లు ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రేవంత్ జనవరి 26 నుంచి జూన్ వరకు పాదయాత్ర చేయడానికి రెడీ అయ్యారు. ఇదే క్రమంలో పాదయాత్రకు సంబంధించి తాజాగా సమావేశం ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు.

కానీ ఈ సమావేశానికి సీనియర్లు డుమ్మా కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో టి‌పి‌సి‌సి కార్యక్రమంపై తమకు సమాచారం లేదని ఏ‌ఐ‌సి‌సి కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఇక హత్ సే హత్ పాదయాత్ర గురించి సమాచారం వచ్చిందని..ఈ పాదయాత్రని ఎవరికి వారు తమ నియోజకవర్గాల్లో రెండు నెలల పాటు చేస్తారని అంటున్నారు. అటు హైదరాబాద్ లో జాతీయ, రాష్ట్ర నేతలు పాదయాత్ర చేస్తారని..రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొంటారని చేప్పారు.

అయితే రేవంత్ వ్యక్తిగతంగా చేసే పాదయాత్ర తెలియదని, ఆయన యాత్రకు ఏ‌ఐ‌సి‌సి పర్మిషన్ ఇవ్వలనీ ఏలేటి చెప్పుకొచ్చారు. మొత్తానికి రేవంత్ పాదయాత్రకు సొంత పార్టీ నేతలే చెక్ పెట్టేలా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news