బోలు ఎముకల వ్యాధి(ఆస్టియోపోరోసిస్).. ఇంతకుముందు వరకు వయసు పైబడిన వారే దీని బాధితులు!! ఇప్పుడు మన దేశానికి చెందిన యువత కూడా ఆ జాబితాలో చేరిపోతున్నారని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. ఎముకలు బలహీనపడి పెలుసుబారడం ఈ వ్యాధి లక్షణం. ఆధునిక జీవన విధానం వల్ల దైనందిక జీవితంలో చోటు చేసుకుంటున్న మార్పులే ఇందుకు కారణమని చెప్పారు. భారత్ లోని యువతకు డీ విటమిన్, కాల్షియం అందకపోవడంతో ఈ వ్యాధి బారిన పడుతున్నారని పరిశోధకులు తెలిపారు.
ఉదయాన్నే శరీరం మీద ఎండ పడేలా తిరిగితే ‘డీ’ విటమిన్ పొందవచ్చు. అలాగే, పాల ఉత్పత్తులు తీసుకుంటే కాల్షియం అందుతుంది. ఈ రెండింటికీ యువతలో చాలా మంది దూరంగా ఉంటున్నారని పరిశోధకులు గుర్తించారు. దీని వల్ల మోకాళ్లు, కీళ్ల నొప్పుల వ్యాధులకు గురవుతున్నారని వివరించారు.