మ‌హా సంచ‌ల‌నం… శివ‌సేన‌కు 175 ఎమ్మెల్యేల స‌పోర్ట్‌

-

మహారాష్ట్ర రాజ‌కీయం గంట గంట‌ల‌కు ఉత్కంఠ భ‌రిత‌మైన మ‌లుపులు తిరుగుతోంది. నాయ‌కులు, పార్టీలు ఎవ‌రికివారే.. అధికార పీఠం కోసం కుస్తీ ప‌డుతున్నారు. అసెంబ్లీలో మొత్తం 288 మంది స‌భ్యులు ఉన్నారు. ఇక్క‌డ ఏ పార్టీకి అయినా సీఎం పీఠం ద‌క్కాలంటే 145 మంది మ‌ద్ద‌తు అవ‌స‌రం. బీజేపీకి 105 మాత్ర‌మే సీట్లు ద‌క్కాయి. మిత్ర‌ప‌క్ష‌మైన శివ‌సేన‌కు 56 సీట్లు వ‌చ్చాయి. అయితే ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాక శివ‌సేన త‌మ‌కు సీఎం పీఠంతో పాటు మంత్రి ప‌ద‌వుల విష‌యంలో 50- 50 ఫార్ములా అమ‌లు చేయాల‌ని కండీష‌న్ పెట్టింది.

ఇందుకు బీజేపీ ఒప్పుకోక‌పోవ‌డంతో అటు శివ‌సేన కూడా ప‌ట్టు విడ‌వ‌డం లేదు. ఇక సొంతంగానే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించిన క‌మ‌లనాథులు ఇప్ప‌టి వ‌ర‌కు ఏం చేయాలో కూడా తెలియ‌ని ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇక శివ‌సేన‌కు ఇప్ప‌టికే కాంగ్రెస్‌, ఎన్సీపీ సోపోర్ట్ చేస్తామ‌ని ప్ర‌క‌టించాయి. ఈ నేప‌థ్యంలో శివ‌సేన ఫైర్‌బ్రాండ్ నేత‌, ఆ పార్టీ ఎంపీ సంజ‌య్ రౌత్ కొద్ది రోజులుగా సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో క‌మ‌ల‌నాథుల‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాడు.

తాజాగా మ‌హారాష్ట్ర‌లో ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన నౌత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తమకు 170 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారని చెప్పారు. మరో ఐదుగురు కూడా తమకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని… అప్పుడు త‌మ‌కు మ‌ద్ద‌తు ఇచ్చే వారి సంఖ్య 175కు చేరుకుంటుంద‌న్నారు. ఒకవేళ ప్ర‌భుత్వ ఏర్పాటులో బీజేపీ విప‌ల‌మైతే రెండో పెద్ద పార్టీగా ఉన్న శివ‌సేన ఎన్‌సీపీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముందని బాంబు పేల్చ‌డంతో మ‌హారాష్ట్ర రాజ‌కీయాలు మాంచి కాక‌గా మారాయి.

విచిత్రం ఏంటంటే శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీ సిద్ధాంతాలు వేర్వేరైనా బీజేపీ టార్గెట్‌గానే ఇప్పుడు ఈ మూడు పార్టీలు రాజ‌కీయం చేస్తున్నాయి. ఇటు శివ‌సేన కూడా ఇదే విష‌యాన్ని ఓపెన్‌గా చెప్పింది. ఇక ఆరు ద‌శాబ్దాల శివ‌సేన చ‌రిత్ర‌లో తొలిసారి ఆ కుటుంబం నుంచి ఒక‌రు ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెలిచారు. వర్లి నుంచి పోటీ చేసి గెలిచిన ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని శివసేన కోరుతోంది. మ‌రి ఇన్ని ట్విస్టుల నేప‌థ్యంలో మ‌హా రాజ‌కీయం ఎలా మ‌లుపులు తిరుగుతుందో ?  చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news