కిడ్నీలో రాళ్లకు..ఆక్సలేట్, కాల్షియం కారణమా..?వీటిని తినటం మానేస్తున్నారా..

-

ఉండాల్సినవని ఉండాల్సిన చోట లేకుంటే.. అది సమస్యే అవుతుంది. బయట ఉండే డస్ట్‌లో చిన్న నలక కంట్లో పడితే విలవిలలాడిపోతాం.. నేల మీద ఉండాల్సిన రాళ్లు కిడ్నీల్లో ఉంటే..ఆ నొప్పి మాములుగా ఉండదు. శరీరం మొత్తం పై తీవ్ర ప్రభావం చూపెడుతుంది. బాడీకి సరిపడా వాటర్‌ డైలీ ఇస్తుంటే మనం ఏదైనా తినకూడని తిన్నా సెట్‌ అవుతుంది. కానీ చాలామంది దాహం వేసి తాగాలనిపిస్తేనే తాగుతారు. అలా కాకుండా గంటగంటకు తాగాలి..ఒక గ్లాస్‌ నీళ్లు అయినా బాడీకీ గంటకోసారి ఇవ్వాలని నియమంగా పెట్టుకుంటే హెల్తీగా ఉంటారు. ఆక్సలేట్ (Oxalate), కాల్షియం (Calcium) కిడ్నీ స్టోన్స్‌కి ప్రధాన కారణమని కొందరు వాటిని అసలు తీసుకోరు. కానీ వైద్యులు వీటిని తీసుకోవచ్చని చెబుతున్నారు.

కిడ్నీలో రాళ్లకు ఎలా చెక్ పెట్టాలి?

ఒక్కొక్కరి కిడ్నీలో ఒక్కో ఒక విధంగా రాళ్లు ఏర్పడుతుంటాయి. కచ్చితంగా వీటివల్లే కిడ్నీలు రాళ్లు వస్తాయి అని చెప్పలేం. వారు పాటించే అలవాట్లే సమస్యకు కారణాలు అవుతాయి. ఆ రాళ్ల సైజు, తీవ్రత, అవి వేటివల్ల వచ్చాయనే అంశాలను బట్టి ఏ ఆహారాలు ఉత్తమమైనవో నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. కాల్షియం, ఆక్సలేట్ కారణంగా వచ్చే రాళ్లతో బాధపడుతున్నవారు ఆక్సలేట్, కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు కనిపిస్తాయి. వీటిని కలిపి తీసుకుంటే, కిడ్నీలలోకి ప్రవేశించే ముందు అవి ఒకదానితో ఒకటి అతుక్కుపోతాయి. వాటిని మూత్రపిండాలు శుద్ధి చేయడం ప్రారంభించక ముందే కడుపు, ప్రేగులలో ఒకదానికొకటి కనెక్ట్ అవుతాయి. తద్వారా రాళ్లు ఏర్పడే ఛాన్స్ చాలావరకు తగ్గిపోతుందని వైద్యులు అంటున్నారు.

ఆక్సలేట్ రిచ్ ఫుడ్స్ తినకపోతే మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా నిరోధించవచ్చని చాలామంది అనుకుంటారు. కాల్షియం కూడా ఈ రకమైన రాళ్లకు దారి తీస్తుందనే భావన అందరిలో బలంగా ఉంది. తద్వారా ఆహారంలో వాటిని తగ్గిస్తే రాళ్లు అభివృద్ధి చెందే ప్రమాదాన్ని తగ్గించవచ్చని తప్పుగా భావిస్తున్నారు. కానీ..ఈ ఫుడ్స్ మానేయాల్సిన పని లేదని వైద్యులు చెప్తున్నారు. దానికి బదులుగా రాళ్లను తగ్గించుకునేందుకు సోడియం వాడకాన్ని తగ్గిస్తే మంచిది అంటున్నారు. ఆక్సలేట్, కాల్షియం రెండు కలిపి తీసుకోవడానికి ఆకుకూరలు, కూరగాయలు జ్యూస్ చేసుకొని తాగాలి. వీటిలో ఆక్సలేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాల్షియం కంటెంట్‌ను పెంచడానికి, ఆకుకూరలను నట్ మిల్క్ లేదా డెయిరీ మిల్క్‌తో కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. కాబట్టి అపోహలకు చెక్‌పెట్టి వాస్తవాలవైపు దృష్టి పెట్టండి..!

Read more RELATED
Recommended to you

Latest news