చెవుల్లో రింగుమనే శబ్ధాలు వస్తున్నాయా.? కారణం ఇదే కావొచ్చు

అప్పడప్పుడు మనకు చెవుల్లోంచి రింగుమనే సౌండ్స్ వస్తాయి. ఈ విషయం ఇంట్లో చెప్పామంటే.. ముందా.. అ ఇయర్ ఫోన్స్ పెట్టి పాటలు వినటం, సినిమాలు చూడటం ఆపేయమంటారు. అదేంటో కానీ..మనకు ఏ సమస్య వచ్చినా ఇంట్లో వాళ్లు దానికి కారణం ఫోన్ వాడకమే అంటారు.
బేసిక్ గా అది కూడా ఒక రీజన్ అవుతుందనుకోండి..! అయితే ఇలా రింగుమనే శబ్దాలు రావడాన్ని వైద్యభాషలో టిన్నిటస్ అంటారట. బయట నుండి ఎలాంటి శబ్ధాలు లేకుండానే చెవిలోపల రింగు,రింగు మనే శబ్ధం వినిపిస్తుంది. కొన్ని సార్లు ఈ శబ్ధాలు చాలా పెద్దవిగా, చిన్నవిగా కూడా ఉంటాయి. అయితే ఇదేమి వ్యాధి కాదంటున్నారు వైద్యులు.
చెవుల్లో రింగు రింగు మనే శబ్ధాలే కాకుండా మరికొందరిలో పెద్ద ధ్వని, పాము బుసలు కొడుతున్న సౌండ్స్, ఈల వేస్తున్నట్లు శబ్ధాలు, అస్పష్టమైన శబ్ధాలు వినిపించటం వంటివి కూడా వినిపిస్తాయి. సాధారణంగా ఇలాంటి శబ్ధాలు కొన్ని నిమిషాలపాటు ఉంటాయి. అయితే మరికొందరిలో మాత్రం దీర్ఘాకాలంపాటు వనిపిస్తూనే ఉంటాయి. అయితే ఇలా చెవిలో శబ్దాలకు వినికిడి లోపానికి సంబంధం ఉందని నిపుణులు అంటున్నారు. చెవిలో శబ్దాలు వినిపిస్తున్నాయంటే అప్పటికే వినికిడి లోపంతో బాధపడుతున్నట్లు మీరు గమనించుకోవాలి. పగలంతా బయటి శబ్దాల వల్ల చెవి లోపలి శబ్దాలను చాలా మంది గుర్తించుకోలేరు.

 టిన్నిటస్ సమస్యకు కారణాలేంటి..?

  • ఈ సమస్య వయో వృద్ధుల్లో సర్వసాధారణంగా కనిపిస్తుంది.
  • చిన్నపిల్లలు, యుక్తవయస్సు వారిలో సైతం ఈ పరిస్ధితి కొన్ని సందర్భాల్లో ఉంటుంది. చెవిలో డస్ట్..( గులిమి) పేరుకుపోవటం, సైనస్ ఇన్ఫెక్షన్, హార్మోన్ల మార్పులు, థైరాయిడ్, చెవికి దెబ్బతగలటం, అలసట, ద్రవాలు,మెదడు వాపు, గవద బిళ్లలు కొన్ని రకాల ఔషదాల కారణంగా కూడా ఈ టన్నిటస్ కనిపిస్తుంది.
  • వృద్ధుల్లో ఈ పరిస్ధితి వచ్చిందంటే వినికిడి లోపానికి సంకేతంగా వైద్యులు అంటున్నారు. ప్రధానంగా పరిశ్రమలు, మ్యూజికల్ ట్రూప్ లలో పనిచేసే వారికి ధ్వని కారణంగా ఈ టన్నిటస్ లక్షణం ఉంటుందట.

చికిత్స ఎలా ఉంటుంది..?

  • వినికిడి పరీక్షల ద్వారా వైద్యులు ఈ సమస్యను నిర్ధారిస్తారు.
  • ఇంపిడెన్స్‌ ఆడియోమెట్రీ, ప్యూర్‌టోన్‌ ఆడియోమెట్రీ పరీక్షల ద్వారా కర్ణభేరి వెలుపల, వెనక మధ్య చెవిలో ఇన్‌ఫెక్షన్‌, సమస్యలను గుర్తించవచ్చట.
  • బ్రెయిన్‌ స్టెమ్‌ ఎవోక్‌ రెస్పాన్స్‌ ఆడియోమెట్రీ అనే పరీక్ష ద్వారా మాట్లాడలేని వయస్సున్న పిల్లలకు వినికిడి శక్తి ఎంత శాతం ఉందో కనిపెట్టవచ్చు. ఓటో ఎకోస్టిక్‌ ఎమిషన్ పరీక్ష ద్వారా పుట్టిన వెంటనే పిల్లలు వినికిడి శక్తితో పుట్టారో తెలుసుకోవచ్చు.
  • చెవిలోపల ఉన్న పరిస్ధితిని పరిశీలించిన తరువాత అందుకు తగ్గట్టుగా వైద్యులు చికిత్సను అందిస్తారు.
-Triveni Buskarowthu