ఎండలో ప్లాస్టిక్‌ బాటిళ్లలో వాటర్‌ తాగుతున్నారా..? అధ్యయనాలు ఏం అంటున్నాయంటే..

-

ఇంట్లో ఉంటే..గ్లాసుల్లో వాటర్‌ తాగుతుంటాం.. కానీ బయటకు వెళ్లినప్పుడు కచ్చితంగా బాటిల్‌ క్యారీ చేయాల్సిందే.. అదే ట్రైన్‌ జర్నీలు అయితే..ప్లాస్టిక్‌ బాటిళ్లలో నీరు తాగాలి.. చాలా చోట్ల తెలిసీ తెలియక తప్పక మనం ప్లాస్టిక్‌ బాటిళ్లలో వాటర్‌ తాగుతుంటాం. కానీ ప్లాస్టిక్‌ వాడకం మంచిది కాదని మనందరికీ తెలుసు.. ఒక్కసారి తాగితే ఏం అవుతుందిలే అనే అశ్రద్ధతో తాగేస్తుంటారు. కానీ తాజా అధ్యయనాలు కొన్ని ఘటైన విషయాలు చెప్పాయి. అవేంటంటే..

‘Frontiers.org’ పరిశోధన ప్రకారం.. బాటిల్ వాటర్ వేడితో తాకినట్లయితే అది చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకు కారులో, వ్యాయామశాలలో లేదా బహిరంగ ఆటల సమయంలో సూర్యరశ్మికి గురైన నీరు ఆరోగ్యానికి హాని చేస్తుంది. ప్లాస్టిక్ సీసాలు సూర్యరశ్మికి లేదా వేడికి గురైనప్పుడు అవి మైక్రోప్లాస్టిక్‌లను విడుదల చేస్తాయి. అటువంటి పరిస్థితిలో మనం ఈ నీటిని తాగినప్పుడు ఇది శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను కాపాడే ఎండోక్రైన్ వ్యవస్థను బాగా ప్రభావితం చేస్తుంది. ఇలాంటి నీటిని ఎక్కువ సేపు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు. ఇది హార్మోన్ల అసమతుల్యత, యుక్తవయస్సు ప్రారంభంలో వంటి సమస్యలకు దారి తీస్తుంది. ఇది మన కాలేయాన్ని కూడా పాడుచేస్తుంది. అలాగే వంధ్యత్వానికి కూడా కారణమవుతుంది.

నివేదికల ప్రకారం.. ప్లాస్టిక్ సీసాలు ఎక్కువ కాలం ఉంటాయి. త్వరగా నాశనం కావు… ఒక లీటర్ వాటర్ బాటిల్ తయారీలో 1.6 లీటర్ల నీరు వృథా అవుతుంది. మైక్రో ప్లాస్టిక్‌లు చాలా సూక్ష్మమైన కణాలు ఉన్న ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని తాగడం ద్వారా అవి మానవ అలిమెంటరీ కెనాల్ ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు చేరుకుంటాయి.

ఇలా ప్లాస్టిక్‌ బాటిళ్లలో నీటిని తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బయటకు వెళ్లినప్పుడు ప్లాస్టిక్‌ బాటిళ్లకు ఎండ తగిలిన నీళ్లు అసలే తాగొద్దు. అలాగే చాలామంది.. సింగిల్‌ యూస్‌ ప్లాస్టిక్‌ బాటిళ్లను తాగి పడేయకుండా వాటిని మళ్లీ మళ్లీ వాడతారు. ఇళ్లలో కూడా ఫ్రిడ్జ్‌ల్లో పెట్టుకుంటారు. ఇలా అస్సలు చేయకూడదు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news