నేటితో రాహుల్‌ దక్షిణ భారత యాత్ర ముగిసి : జైరాం రమేశ్‌

కామారెడ్డి జిల్లాలో రాహుల్‌ గాంధీ పాదయాత్ర సాగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర మాజీమంత్రి జైరాం రమేశ్ మాట్లాడుతూ.. పదకొండు రోజుల పాటు తెలంగాణలో భారత్ జోడోయాత్ర సాగిందన్నారు. 319 కిలోమీటర్లు, 8 జిల్లాల్లో సాగిందని, దక్షిణ భారతంలో ఐదు రాష్ట్రాల్లో ఈ యాత్ర పూర్తి చేసుకుని.. ఈరోజు మహారాష్ట్రలోకి చేరుకుంటుందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా.. ‘నేటితో దక్షిణ భారత యాత్ర ముగిసి.. రేపట్నుంచి ఉత్తర భారత యాత్ర మొదలవుతుంది. అన్ని వర్గాల నుంచి రాహుల్ యాత్రకు స్పందన లభించింది. వారి వారి సమస్యలను వివరించారు. ఇది ఉపన్యాసాలిచ్చే మన్ కీ బాత్ కాదు.. ప్రజల సమస్యలు వినిపించుకునే యాత్ర.

Jairam Ramesh takes dig at PM Modi over his Manipur rally claims

హైదరాబాద్ లో మా జోడోయాత్రకు విశేష స్పందన లభించింది. మునుగోడులో జరిగింది ఓట్ల ఎన్నిక కాదు.. నోట్ల ఎన్నిక. ప్రజాస్వామ్యాన్ని చంపేసి మద్యం, ధనంతో గెల్చిన ఎన్నిక మునుగోడు.తెలంగాణాలో ఎన్నికలంటే వన్ సీర్ టూ.మ సీఆర్ త్రీసీఆర్ ఫోర్ సీఆర్ కేసీఆర్. పాల్వాయి స్రవంతి బాగా పోరాడారు. ఆమెకు అభినందనలు. మేం మునుగోడు విషయంలో చించతించడంలేదు. భారత్ జోడోయాత్ర ప్రభావం లేదని ఎవరన్నా అన్నా మేం పట్టించుకోం. జోడోయాత్ర ఉద్ధేశ్యం వేరు. భారత్ జోడోయాత్ర బీజేపీ, ఆర్ఎస్ఎస్, టీఆర్ఎస్ ను విచారానికి గురిచేసింది. ఇతర రాష్ట్రాల్లో మా ఆపోనెంట్ బీజేపీ ఒకటే అయితే.. తెలంగాణాలో మాకు బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం ముగ్గురు ప్రత్యర్ధులు. మునుగోడులో కాంగ్రెస్ ఓటమిని, ప్రజల తీర్పును శిరసావహిస్తాం. ఆత్మపరిశీలన, సమీక్ష చేసుకుంటాం. తెలంగాణాలో రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉండబోతోంది. భారత్ జోడోయాత్ర తెలంగాణాలోని కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది.’ అని ఆయన వెల్లడించారు.