తరచూ దాహం వేస్తోందా..? అయితే ఈ సమస్యలవ్వచ్చు..!

-

ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం తో పాటు జీవన విధానం కూడా సరిగా ఉండాలి. అదే విధంగా రోజు ఫిజికల్ ఆక్టివిటీ, నీళ్లు ఎక్కువగా తాగడం లాంటి ఆరోగ్యకరమైన పద్ధతులు పాటించాలి. నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల చర్మానికి చాలా బెనిఫిట్ కలుగుతుంది. అలానే జీర్ణ సమస్యలు కూడా ఉండవు. అనారోగ్య సమస్యలు ఏమి ఉండకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఏడు నుండి ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి.

 

drinking

నీళ్లు తాగడం వల్ల కూడా చాలా అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అయితే తరచూ చాలామందికి దాహం వేస్తూ ఉంటుంది ఎన్ని గ్లాసులు నీళ్లు తాగిన ఇంకా దాహం వేస్తూనే ఉంటుంది. అటువంటి వాళ్లు అవసరానికి ఎక్కువ కూడా నీళ్లు తీసుకుంటూ ఉంటారు. ఎక్కువగా దాహం వేయడం తరచు నీళ్లు తాగుతూ ఉండటంవల్ల కూడా మనం కొన్ని సమస్యల్ని గుర్తించొచ్చు. ఎక్కువగా ఇలా మీరు బాధపడుతూ ఉంటే ఈ సమస్యలు మీ ఇంట్లో ఉన్నట్లు.

డయాబెటిస్:

ఈ మధ్యకాలంలో డయాబెటిస్ అన్ని వయసు వాళ్ళకి కూడా వచ్చేస్తోంది. డయాబెటిస్ వస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. కిడ్నీలు ఫిల్టర్ చేయడం కష్టమవుతుంది. బాగా ఎక్కువ దాహం కూడా వేస్తుంది.

అజీర్ణ సమస్యలు:

ఎప్పుడైనా స్పైసీ ఫుడ్ తీసుకున్నప్పుడు సరిగ్గా జీర్ణం అవ్వదు. అటువంటి సమయంలో నీళ్లు ఎక్కువగా కావాల్సి వస్తుంది. అలా నీళ్లు లేక పోయినప్పుడు కూడా దాహం వేస్తుంది.

ఎక్కువ చెమట పట్టడం:

ఉష్ణోగ్రత వేడి గా ఉంటే అప్పుడు కూడా ఎక్కువ నీళ్ళు అవసరమవుతాయి. ఎందుకంటే చెమట ఎక్కువగా పోతుంది కాబట్టి.

యాంగ్జైటీ:

యాంగ్జైటీ వలన కూడా నోరు ఆరి పోతుంటుంది. దీనితో ఎక్కువగా నీళ్లు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు తరచు నీళ్లు తాగుతూ ఉండండి అవసరమైతే డాక్టర్ ని కన్సల్ట్ చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news