ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు వున్నారా..? అయితే రోజూ ఈ నట్స్ ని తీసుకోండి..!

-

చాలా మంది ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉంటారు. అటువంటి వాళ్ళు బరువు తగ్గకపోయినా ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఈ టిప్స్ ని పాటించడం మంచిది. ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఉండటం వల్ల ఇబ్బందులు వస్తాయి.

ఈ నట్స్ ని మీరు డైట్ లో తీసుకుంటే తప్పక బరువు తగ్గొచ్చు. నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు, విటమిన్స్, మినరల్స్ వంటివి ఉంటాయి. కాబట్టి వాటిని తప్పకుండా డైట్ లో తీసుకోండి.

వేరుశెనగ:

పల్లీలు ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు తగ్గడానికి కూడా మనకి బాగా ఉపయోగపడతాయి. గుప్పెడు పల్లీలు లో 121 కేలరీలు ఉంటాయి. ఏడు గ్రాముల ప్రోటీన్, నాలుగు గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. పల్లీలను తీసుకుంటే బరువు బాగా తగ్గొచ్చు.

బాదం:

బాదంలో యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్ సమృద్ధిగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. రోజు 3 నుండి 5 బాదం పప్పులు తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి అవుతుంది.

వాల్ నట్స్:

వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు, కాపర్, విటమిన్ ఎ, డి ఉంటాయి. వాల్ నట్స్ ను తీసుకోవడం వల్ల కూడా త్వరగా బరువు తగ్గొచ్చు. రోజుకి 7 వరకు వాల్ నట్స్ ని తీసుకోవచ్చు. 7 కంటే ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు.

పిస్తా:

పిస్తా లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఇది చూసుకుంటుంది బరువు తగ్గడానికి కూడా పిస్తా బాగా సహాయపడుతుంది. ఇలా ఈ నట్స్ ని తీసుకుంటే బరువు తగ్గచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news