జూ. ఎన్టీఆర్‌ చెబితే మెమెందుకు వింటాం : కొడాలి నాని సంచలనం

జూనియర్‌ ఎన్టీఆర్‌ పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ మమ్మల్ని కంట్రోల్ చేయడం ఏమిటి..? చంద్రబాబు శిష్యులు మాట్లాడే దానికి కంట్రోల్ చేశారా…? అంటూ ప్రశ్నించారు. జూనియర్ ఎన్టీఆర్ చెబితే మెమెందుకు వింటాం..? అని సంచలన వ్యాఖ్యలు చేశారు. నందమూరి కుటుంబం అంటే ముఖ్యమంత్రికి కూడా గౌరవం ఉంటుందని.. వాళ్లు అమాయకులు…ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఆ పార్టీ నాశనం అవుద్దని చంద్రబాబు చెప్పినా విన్నారని గుర్తు చేశారు.

గొర్రె కసాయి వాడినే న్నమ్ముతుంది..చంద్రబాబు ఏది చెప్పినా నమ్మేస్తారని చురకలు అంటించారు. ఆయన భార్య పేరు తెస్తే ఆ కుటుంబం మద్దతు ఇస్తుందని చంద్రబాబు కుట్ర అని ఫైర్‌ అయ్యారు. ఆయన, ఎల్లో మీడియా ఆమెను అల్లరి అల్లరి చేస్తున్నారని మండిపడ్డారు కొడాలి నాని. ఎక్కడ కూడా ఆమెను అసెంబ్లీలో కానీ, బయట కానీ మేము చెప్పలేదని… ఇలాంటి భర్త, కొడుకు దొరకడం ఆమె దురదృష్టంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అక్కడికి వెళ్లి ఏడుపు ముఖం పెడతాడని… అక్కడ వరదల్లో కష్టపడుతుంటే వాళ్ళ దగ్గరకు వెళ్లి నీ సొల్లు పురాణం ఎందుకు అని నిలదీశారు.