చాలా మంది సైనస్ సమస్యతో బాధపడుతూ ఉంటారు మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే ఉపశమనం కోసం వీటిని ఫాలో అవ్వండి ఈ చిట్కాలను ఫాలో అవ్వడం వల్ల సైనస్ సులువుగా తగ్గుతుంది. సైనస్ సమస్య నుండి ఎలా బయట పడవచ్చు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వైరస్ బ్యాక్టీరియా లేదా ఫంగస్ వల్ల ఇది వస్తుంది నిజంగా సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. పైగా చికాకుగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ నాలుగు చిట్కాలు మీకు బాగా ఉపయోగపడతాయి.
ఆవిరి పట్టడం:
ఆవిరి పట్టడం వల్ల సైనస్ నుండి బయటపడవచ్చు మీరు దీని కోసం వేడి నీళ్ళు తీసుకొని క్యాబేజి ఆకులు, వాము వేయండి. దీనిని ఆవిరి పట్టడం వల్ల చక్కగా సైనస్ సమస్య నుండి బయటపడవచ్చు.
హెర్బల్ డ్రింక్ తీసుకోండి:
నీళ్లలో పసుపు మిరియాలు వెల్లుల్లి వేసి మరిగించి కావాలంటే కొద్దిగా తేనె వేసుకుని ఈ మిశ్రమాన్ని తాగండి. దీనివల్ల సైనస్ ఇన్ఫెక్షన్ నుండి బయటపడవచ్చు.
నుదుట మీద ఇలా అప్లై చేసుకోండి:
ఎండిన అల్లం, పసుపు, మామిడి అల్లం పొడి పేస్టులాగా చేసి దీనిని నుదుటి మీద రాత్రి నిద్రపోయేటప్పుడు అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఉదయాన్నే కడిగేసుకోండి.
వేడి నీళ్లు తాగండి:
వేడి నీళ్లు వేడిగా ఉండే సూప్స్ వంటివి తీసుకుంటే కూడా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇలా సైనస్ తో బాధపడే వాళ్ళు ఉపశమనాన్ని పొందవచ్చు.