‘సీతారామం’ స్టోరికి బీజం ఎక్కడ పడిందో చెప్పిన దర్శకుడు హను రాఘవపూడి..

-

హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ కలిసి సంయుక్తంగా నిర్మించిన బ్లాక్ బాస్టర్ మూవీ ‘సీతారామం’, మలయాల స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ జంటగా నటించిన ఈ పిక్చర్ ప్రేక్షకులకు అమితంగా నచ్చింది. వసూళ్లలో రికార్డు క్రియేట్ చేసిన ఈ ఫిల్మ్ ప్రజెంట్ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమవుతోంది.

‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ మూవీ చూసి ఆడియన్స్ వావ్ అంటున్నారు. దర్శకుడు హను రాఘవపూడి చాలా చక్కగా ఈ సినిమాను తీశారని, అందుకే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి ఈ సినిమాను చూసి సక్సెస్ చేశారని సినీ పరిశీలకులు అంటున్నారు. ఈ సంగతులు అలా పక్కనబెడితే దర్శకుడు హను రాఘవపూడి ‘సీతారామం’ మూవీ స్టోరి ఎలా పుట్టిందో చెప్పేశాడు.

ఈ స్టోరికి బీజం ఎలా పడిందనే సంగతి షేర్ చేశాడు దర్శకుడు హను. తాను పుస్తకాలు చదువుతున్న సమయంలో హైదరాబాద్‌లోని కోఠిలో ఓ బుక్ కొన్నపుడు తనకు ఓ లెటర్ దొరికిందని, అప్పటి నుంచి తనకు ఆ పాయింట్ బాగా గుర్తుకొచ్చేదని తెలిపారు. 2017లో ఈ సంఘటన జరగగా, అప్పటి నుంచి స్టోరి లైన్ డెవలప్ చేసుకున్నానని వివరించాడు.

అలా సోల్జర్ తన ప్రేయసికి రాసిన లెటర్ అయితే ఎలా ఉంటుందని, ఆ తర్వాత పాయింట్ డెవలప్ చేసుకున్నానని దర్శకుడు హను రాఘవపూడి చెప్పారు. ఈ సినిమా స్టోరి రాసుకున్న తర్వాత స్టోరికి హీరోగా దుల్కర్ సల్మాన్ అయితే బాగుంటుందని ఆయనను అప్రోచ్ అయినట్లు వివరించాడు. రామ్ పోతినేని, విజయ్ దేవరకొండలతో అనుకున్న స్టోరిలు వేరని దర్శకుడు హను రాఘవపూడి క్లారిటీనిచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news