వాల్‌నట్స్‌ తొక్కలను పడేస్తున్నారా..? అర్రే.. షల్స్‌లోనే ఉందని అసలైన సీక్రెట్..!

-

వాల్‌నట్‌లను చాలామంది షల్‌ లేనివే తీసుకుంటారు.. కానీ మీరు ఒకవేళ షల్‌ ఉన్న వాల్‌నట్స్ తీసుకుంటే..ఆ తొక్కలను అస్సలు వేస్ట్‌ చేయకండి. వాటితో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంటే.. వాల్‌నట్‌ ఉండే విటమిన్-ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని మృదువుగా మార్చుతాయి. ఇది మన చర్మాన్ని కూడా పునరుజ్జీవింపజేస్తుంది. అలాగే ఆ తొక్కలు చర్మానకి మేలు చేస్తాయి.

వాల్ నట్ తొక్కలు చర్మాన్ని చాలా మృదువుగా చేస్తాయి. ఇది పొడి చర్మం నుంచి కూడా ఉపశమనాన్ని ఇస్తుంది.

మీరు వాల్‌నట్ పీల్స్‌తో ఫేస్ ప్యాక్‌ను సిద్ధం చేసుకోవచ్చు.. ఇది చర్మం లోపల ఉన్న మురికిని శుభ్రపరుస్తుంది. అలాగే, ఇది మీ ముఖంపై మురికి వల్ల ఏర్పడిన మరకలను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది.

జిడ్డు చర్మం ఉన్నవారికి వాల్‌నట్ పీల్స్ చాలా మేలు చేస్తాయి. వాల్‌నట్ తొక్కల నుంచి పొడిని తయారు చేసుకోవాలి. ఆ పొడిని మీ చర్మంపై అప్లై చేయండి. ఇది మీ చర్మం నుంచి చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో మీకు సహాయపడుతుంది. చాలా సార్లు సున్ని పిండిని రాసినట్లుగానే ఈ పొడిని రాస్తే సరిపోతుంది. వాల్‌నట్స్‌ షల్స్‌ను మెత్తగా దంచి ఇలా ఉపయోగించవచ్చు. ఇది మోహంపై వచ్చే మచ్చల నుంచి మంచి ఉపశమనంను అందిస్తాయి. కాబట్టి ఈసారి షల్‌ ఉన్న వాల్‌నట్స్‌ తీసుకుంటే పూర్తిగా ఉపయోగించుకోండి.

రోజూ ఉదయం నానపెట్టిన వాల్‌నట్స్‌ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ మీ గుండెను హెల్తీగా ఉంచుతాయి. బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇంకా ఇది మధుమేహ వ్యాధి గ్రస్తులకు మరీ మంచిది. షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంచుంది. జుట్టు ఆరోగ్యానికి, ఫేస్‌ గ్లోయింగ్‌కు ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు. అయితే కనీసం 8గంటలు పాటు నానపెట్టిన తర్వాత వాల్‌నట్స్‌ తినాలి. నానపెట్టిన డ్రైనట్స్‌లో పోషకాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. బాదంపప్పు కూడా అంతే. ఒట్టిదే తినడం కంటే..నానపెట్టుకుని తొక్క వొలిచి తినాలి. అప్పుడే పోషకాలను పూర్తిగా గ్రహించుకోవచ్చు.
Attachments area

Read more RELATED
Recommended to you

Latest news