ముఖానికి ఫేస్‌ సిరమ్‌ వాడేస్తున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!!

-

ఒక స్టేజ్‌ వచ్చినప్పటి నుంచి ముఖంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. లేకుంటే.. డల్‌గా అయిపోయి.. ఏజెడ్‌ లుక్‌ అనిపిస్తుంది. రోజు నైట్‌ ఫేస్‌ సిరమ్‌ పెట్టుకోవడం వల్ల తెల్లారికి ముఖం మంచి గ్లో వచ్చి.. అందంగా ఉంటుంది. చాలామంది మహిళలలు ఇప్పటికే ఫేస్‌ సిరమ్‌ వాడుతుంటారు. అయితే మీ ఫ్రెండ్‌ వాడేది బాగుందని మీరు కూడా అదే తీసుకుని వాడేద్దాం అనుకుంటారు.. అలా అస్సలు చేయకూడదు.. ఫేస్‌ సిరమ్‌ వాడేవాళ్లు కొన్ని విషయాలను తెలుసుకోవాలట..

విటమిన్ సి సీరం :

విటమిన్ సి లక్షణాలతో ఫేస్ సీరమ్‌ను ఉపయోగించవచ్చు. మీరు చిన్న చిన్న మచ్చలు, టానింగ్, ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడానికి మీ చర్మ సంరక్షణ దినచర్యలో భాగంగా చేసుకోవచ్చు. విటమిన్‌ సీ వాడటం వల్ల కొలాజెన్‌ మెష్‌ దెబ్బతినకుండా ఉంటుంది. కొలాజెషన్‌ బాగుంటే..ఫేస్‌ మీద ముడతలు రావు..బాడీకి సరిపడా విటమిన్‌ సీ అందిస్తే.. హెల్తీగా, అందంగా ఉండొచ్చు.
హైలురోనిక్ యాసిడ్ ఫేస్ సీరమ్- డల్ స్కిన్ రిపేర్ చేయడానికి మీరు హైలురోనిక్ యాసిడ్‌ని ఎంచుకోవచ్చు. జిడ్డుగల చర్మం ఉన్నవారికి ఇది ఉత్తమ ఎంపిక సౌందర్య నిపుణులు అంటున్నారు. దీంతో రంధ్రాలలో దాగి ఉన్న మురికి తేలికగా తొలగిపోతుంది.
AHA+BHA ఫేస్ సీరమ్ – ఆల్ఫా హైడ్రాక్సీ, బీటా హైడ్రాక్సీ యాసిడ్‌లను కలిగి ఉన్న ఈ ఫేస్ సీరమ్ జిడ్డు చర్మానికి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. టానింగ్, ఓపెన్ పోర్స్ పెరగడం వంటి అనేక చర్మ సమస్యలను మీరు దీనితో అధిగమించవచ్చు. ఇది ప్రతి రోజు ఉపయోగించవచ్చు.
రెటినోల్ ఫేస్ సీరమ్- చిన్న చిన్న మచ్చలు, చర్మంపై ముడతలు వంటి అకాల వృద్ధాప్య లక్షణాలను ఎదుర్కొంటున్న వ్యక్తులు డైలీ..రెటినోల్ ఫేస్ సీరమ్‌ను చేర్చుకోవచ్చు. దాని ప్రభావం కొద్దిరోజుల్లోనే ముఖంపై కనిపిస్తుంది.
అయితే మీరు ఫేస్ సిరమ్‌ వాడాలనుకుంటే.. సౌందర్య నిపుణులు లేదా..చర్మ నిపుణుల సలహా తీసుకుని మీ స్కిన్‌కు ఏది బాగుంటుందో చూసుకుని ఎంచుకోండి..అప్పుడే మంచి ఫలితం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news