ట్రెడ్ మిల్ మీద వర్కౌట్స్ చేస్తున్నారా? ఐతే ఈ తప్పులు చేయకండి.

ఉదయం లేవగానే వ్యాయామం చేసేవారికి ట్రెడ్ మిల్ మంచి వ్యాయామ సాధనంగా ఉంటుంది. మహమ్మారి సమయంలో ఇంట్లోనే ఉంటూ శారీరక శ్రమ చేయడానికి ట్రెడ్ మిల్ బాగా పన్చేస్తుంది. ఐతే మీకిది తెలుసా? ట్రెడ్ మిల్ మీద వర్కౌట్ చేసేటపుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దాని గురించి పూర్తిగా తెలుసుకోకుండా ట్రెడ్ మిల్ వాడవద్దు. ప్రస్తుతం ట్రెడ్ మిల్ మీద ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం.

ట్రెడ్ మిల్ వార్మప్

ఏ వ్యాయామం చేసినా సరే దానికంటే ముందు వార్మప్ చేయడం మర్చిపోవద్దు. ట్రెడ్ మిల్ మీద వర్కౌట్స్ చేసేముందు కూడా వార్మప్ చేయాల్సిందే. దీనివల్ల గాయలు ఎక్కువగా అవకుండా ఉంటుంది. అలాగే మీ వేగం పెరుగుతుంది.

ట్రెడ్ మిల్ పెద్ద అడుగులు

పెద్ద అడుగులు వేయడం వల్ల గాయాలు అయ్యే అవకాశం ఎక్కువ. అలా కాకుండా మీ కాళ్ళు ఎంత మేరకు సౌకర్యంగా ఉన్నాయో చూసుకుని అంతవరకే అడుగులు తీసుకోవాలి. అది మీ కాళ్ళకే వదిలేయాలి. కొద్ది సేపటికి అదే సెట్ అవుతుంది.

ట్రెడ్ మిల్ కాళ్ళ వంక చూడడం

ఇది చాలా మందికి అలవాటుగా ఉంటుంది. ట్రెడ్ మిల్ మీద ఉన్నప్పుడు కాళ్ళు చూస్తూ ఉంటారు. దానివల్ల బ్యాలన్స్ తప్పిపోయి పడిపోయే ప్రమాదం ఎక్కువ. అందుకే మెడని వంచకుండా ముందుకు చూస్తూ ఉండడమే ఉత్తమం.

ఒకే రకమైన వ్యాయామం

ట్రెడ్ మిల్ మీద ఒకే రకమైన వ్యాయామం చేయవచ్చని అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. రకరకాల వ్యాయామాలకు ట్రెడ్ మిల్ వాడవచ్చు.

షూ

ఇది చాలా ముఖ్యమైనది. ట్రెడ్ మిల్ కి సరిపోయే సరైన షూ కంపల్సరీ. లేదంటే వర్కౌట్ సరిగ్గా సాగదు. ట్రెడ్ మిల్ మీద మెత్తటి రన్నింగ్ షూ ఉంటే బాగుంటుంది.

కడ్డీ పట్టుకోవడం

పరుగెత్తుతున్నట్టు చేతులు గాల్లో ఉంచకుండా కడ్డీ పట్టుకుంటే ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. కాబట్టి కడ్డీ పట్టుకుని వ్యాయాం చేస్తే మరింత బాగుంటుంది.