శిశువుల చర్మ సంరక్షణ కోసం తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

-

శిశువుల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే చర్మ సమస్యలు రావడానికి చాలా తొందరగా అవకాశం ఉంటుంది. ఈ విషయమై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి. శిశువుల చర్మ సంరక్షణకి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

చర్మ సంరక్షణకి జాగ్రత్తలు తీసుకోకపోతే దద్దుర్లు,, అలర్జీలు తొందరగా వస్తాయి. అందువల్ల ఎప్పుడూ కనిపెట్టుకుని ఉండడం మంచిది.

ముఖ్యంగా స్నానం చేయించేటపుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ సబ్బు పడితే ఆ సబ్బు శిశువు చర్మంపై ప్రయోగించరాదు. అలర్జీ కలిగించని సబ్బుని మాత్రమే వాడాలి. గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి. స్నానం చేసిన తర్వాత ఆరబెట్టడానికి గాలికి తిప్పకూడదు. వెచ్చగా ఉన్న గదిలో ఆరెబెట్టడం మంచిది. గదిలో ఎయిర్ కండిషన్లు వంటి వాటిని ఆఫ్ చేసుకోవడం ఉత్తమం. అలాగే స్నానం చేసాక తుడిచే టవెల్ కఠినంగా ఉండకూడదు. మృదువైన టవెల్ మాత్రమే ఉపయోగించాలి.

చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా ఉండే పౌడర్లనే వాడుకోవాలి. సువాసనలు వెదజల్లే పౌడర్లని వాడవద్దు. అందులో ఉన్న రసాయనాల వల్ల శిశువు చర్మం పాడవుతుంది.

డైపర్లు వాడుతున్నప్పుడు చర్మం చికాకు పెడుతుందేమో గమనించుకోవాలి. పిరుదుల దగ్గర అలాంటి ఇబ్బంది ఉందని తెలిస్తే వెంటనే ఆ కంపెనీ డైపర్లని మార్చాలి. లేదంటే ఆ భాగంలో చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

కొంతమంది శిశువుల్లో బర్త్ మార్క్ లు వస్తాయి. బర్త్ మార్క్ అనగా చర్మంపై అక్కడక్కడా రంగు తేలిపోయినట్టుగా అనిపిస్తుంది. ఐతే అది పెద్ద సమస్య కాదు.

చర్మ సమస్యల్లో దాదపుగా అన్నీ అంటువ్యాధులే. అందులో తామర కూడా ఒకటి, సాధారణంగా తామర, ముఖం, మోచేయి, మోకాళ్ళ వెనక, ఛాతీ దగ్గర వ్యాపిస్తూ ఉంటుంది. ఇలా సంభవించినపుడు వైద్యుడి వద్దకి వెళ్ళడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news