ఆయర్వేదంతో మరెంత అందంగా మారండి..!

-

ముఖాన్ని అందంగా ఉంచుకోవాలని అందరూ అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్లు అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మంచి అందమైన చర్మాన్ని పొందాలంటే ఆయర్వేదం(Ayurveda) నిపుణులు చెప్పిన ప్రకారం ఈ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. దీంతో మీ చర్మం అందంగా క్లియర్ గా ఉంటుంది. మరి ఆలస్యం ఎందుకు వాటికోసం మనము ఇప్పుడు తెలుసుకుందాం.

 

ఆయర్వేదం/ Ayurveda
ఆయర్వేదం/ Ayurveda

ఆయుర్వేదం ప్రకారం ఈ చిట్కాలు పాటిస్తే మీ చర్మం మరింత అందంగా ఉంటుంది:

మీరు తీసుకొనే డైట్ లో ఎక్కువ పండ్లు, కూరగాయలు తీసుకోండి. అదే విధంగా మంచి పోషక పదార్థాలని మీరు డైట్ లో తీసుకుంటూ ఉండటం. దీని వల్ల మీ చర్మం అందంగా ఉంటుంది. పైగా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

అలానే ముల్తానామట్టి కూడా చర్మాన్ని అందంగా మారుస్తుంది. ముల్తాని మట్టి లో కొద్దిగా పసుపు కానీ తులసి కానీ వేసుకుని.. మిక్స్ చేసి ముఖానికి పట్టించి కాసేపు వదిలేసి ముఖం కడుక్కుంటే అందంగా మారొచ్చు.

లేదా మీరు తులసి ఆకులలో పాలు వేసి ముఖానికి స్క్రీన్ కింద చేసుకుని 20 నిమిషాల పాటు అలా వదిలేస్తే చర్మం అందంగా ఉంటుంది. గ్లో కూడా పెరుగుతుంది.

అలోవెరా గుజ్జులో పసుపు కలుపుకుని ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి నీళ్లతో కడిగేసుకోండి. దీని వల్ల చర్మం అందంగా ఉంటుంది. యాక్నీ సమస్య కూడా తొలగిపోతుంది. డార్క్ సర్కిల్స్ వంటివి కూడా తొలగించుకోవచ్చు ఇలా ఆయుర్వేద గుణాలు వుండే ఈ పదార్ధాలతో ఎన్నో బెనిఫిట్స్ మీరు పొందవచ్చు అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news