చర్మం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ముఖం అందంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మేకప్ వేసుకోవడం వల్ల తాత్కాలికంగా మనం చాలా అందంగా కనిపించవచ్చు. కానీ దాని కోసం మనం ఉపయోగించే ఉత్పత్తుల వల్ల చర్మ ఆరోగ్యం మరింత దెబ్బ తింటుంది. ముఖం కాంతివంతంగా అవ్వాలంటే తప్పక ప్రయత్నించాలి. ఓట్స్ ని ఉడికించి మెత్తగా రుబ్బుకోవాలి . అందులో కాస్త నిమ్మ రసం కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. అరగంట తరువాత చల్లటి నీటి తో కడిగేసుకోవాలి. ఇదే విధంగా వారానికి రెండు సార్లు చేయడం వల్ల చెమట వల్ల పట్టిన మురికి తొలగిపోతుంది. దాంతో ముఖం కాంతివంతగా మారుతుంది.
నునుపైన మెడ కోసం ఈ విధంగా చేయొచ్చు. ఒక బంగాళదుంప ని పొట్టు తీయకుండా ఉడకబెట్టి మెత్తగా మెదుపుకోవాలి. దీని లో కొద్దిగా పాలు, కొబ్బరి నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా
చేయడం వల్ల మెడ నలుపు తగ్గి చర్మం కాంతివంతమవుతుంది.
అదే జిడ్డు చర్మం అయితే స్వచ్ఛమైన పసుపు లోని నిమ్మరసం కలిపి ముఖానికి ,మెడకు, చేతులకు రాసుకోవాలి. నిమ్మరసం సహజమైన బ్లీచ్ లాగా పని చేస్తుంది. దానితో మురికి ఏబీతో సులువుగా తొలగిపోతుంది మరియు ఈ ప్యాక్ వేసుకున్నప్పుడు కొంచెం మంటగా ఉంటుంది కానీ మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ సులువైన పద్ధతులని కనుక మీరు పాటిస్తే మీ అందం రెట్టింపు అవుతుంది.