సబ్బు, శానిటైజర్ తో పొడిబారుతున్న చేతులు.. ఆయుర్వేదంలో అద్భుత చిట్కాలు..

-

మహమ్మారి సమయంలో చేతుల శుభ్రత నిత్యవసరంగా మారిపోయింది. సబ్బు, శానిటైజర్ ని వాడుతూ తరచుగా చేతులని శుభ్రం చేసుకుంటూ ఉన్నారు. దీనివల్ల చేతులు పొడిగా మారుతున్నాయి. సబ్బు, శానిటైజర్ అతిగా వాడడం వల్ల చర్మంలోని తేమ కోల్పోయి పొడిబారడం మొదలవుతుంది. మీరు కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నారా? ఐతే కింద ఇచ్చిన ఆయుర్వేద చిట్కాలు పాటించండి. కోల్పోయిన తేమని తిరిగి తెచ్చుకోండి.

అసలు చర్మానికి ఏమవుతుంది?

చర్మంపై ఉండే పై పొర చాలా సున్నితంగా ఉంటుంది. తరచుగా సబ్బు, శానిటైజర్ ని వాడడం వల్ల ఆ పై పొర దెబ్బతిని పొడిబారడం మొదలవుతుంది. అంతేకాదు అనేక అలర్జీలకు దారితీస్తుంది.

ఏం చేయాలి?

ఇలాంటి సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే పొడిబారిన చేతులు తిరిగి తేమని సంతరించుకుంటాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. చేతులు పొడిబారడం అనేది చాలా చిన్న సమస్యగా అనుకుంటే పొరపాటే. ఒక్కోసారి అవి చాలా తీవ్రంగా మారి అలర్జీతో ఇబ్బంది కలగజేస్తాయి.

దీన్ని నివారించడానికి ఏం చేయాలంటే,

బట్టలు ఉతకడం, బోళ్ళు తోమడం వంటివి చేసిన తర్వాత కొబ్బరినూనెని చేతులకి మర్దన చేయాలి.

ఇది కాకుండా ఆయుర్వేదంలోని చిట్కాని పాటించాలంటే,

100గ్రాముల పెసల గింజలు
100గ్రాముల బియ్యం
10గ్రాముల దాల్చిన చెక్క
10గ్రాముల పసుపు

వీటన్నింటినీ గ్రైండర్ లో వేసి బాగా రుబ్బాలి. అప్పుడూ పొడి తయారవుతుంది. ఈ పొడిని చేతులు కడిగేటపుడు నీళ్ళలో కలుపుకుని స్క్రబర్ లాగా ఉపయోగించి రుద్దుకుంటే సరిపోతుంది. ఇలా తరచుగా చేస్తుంటే పొడిబారిన చేతులు తిరిగి తేమను సంతరించుకుంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news