ముఖం తెల్లగా ఉండి మెడ నలుపుగా ఉందా?

-

చాలామంది చేసే తప్పేంటంటే.. ముఖానికి మాత్రమే క్రీములు, పౌడర్లు రాస్తుంటారు. మెడ గురించి అసలు పట్టించుకోరు. దాంతో ముఖం మాత్రం తెల్లగా ఉండి మెడ నలుపుగా కనిపించడంతో అందహీనంగా ఉంటుంది. దీన్ని గుర్తించిన వారు మెడ గురించి శ్రద్ధ తీసుకోవాలనుకుంటారు. కానీ ఏం చేయాలో తెలియదు. అలాంటి వారు ఈ కింది చిట్కాలను ఫాలో అవ్వండి.

ఈ చిట్కాలతో మెడ తెల్లగా, మృదువుగా చేసుకోవచ్చు. ఈ చిట్కాలేంటో తెలుసుకుందాం.
– నిమ్మకాయ రసంలో కొంచెం ఉప్పు కలిపి మెడమీద రుద్దుకోవాలి. 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. నిమ్మకాయలోని విటమిన్ సి మెడమీద ఉన్న మృతకణాలను నాశనం చేస్తుంది.

– నిమ్మరసంలో స్పూన్ దోసకాయరసం, గంధం వేసి బాగా కలుపాలి. దీన్ని మిశ్రమంలా తయారు చేసుకోవాలి. దీన్ని మెడమీద రాసుకొని అరగంట తర్వాత చల్లని నీటితో కడుగాలి. ప్రతిరోజూ ఈ పద్ధతిని పాటించడం వల్ల మెడమీద నలుపు త్వరగా తగ్గిపోతుంది.

– మెడ తెల్లగా కావాలంటే స్పూన్ గంధంలో కొంచెం రోజ్‌వాటర్ వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రివేళ మెడకు రాసుకొని ఉదయాన్నే కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మెడతెల్లగా మారుతుంది.

– నిమ్మరసంలో కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మెడకు రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత నీటితో కడుగాలి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తే మెడ తెల్లగా అవుతుంది.

– ఆలుగడ్డను ముక్కలుగా కోసుకోవాలి. దీన్ని రెండువారాలకు ఒకసారి మెడమీద రుద్దుకుంటే మార్పును గమనించవచ్చు.

– బాదంపప్పులను నాలుగు గంటలు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత వాటికి పొట్టుతీసి కొద్దిగా రోజ్‌వాటర్ కలిపి పడుకునే ముందు మెడమీద రుద్దుకొని ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడుక్కుంటే మెడమీద నలుపు తొలుగుతుంది.

– కలబంద రసాన్ని మెడమీద రుద్దుకొని 20 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే మెడ తెల్లగా కనిపిస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news