వృద్ధాప్యం నుండి యవ్వనానికి.. మీ కాలచక్రం రివర్స్ లో తిరగాలంటే ఇలా చేయండి..

-

వయసు పెరుగుతుంటే దాన్నెలా కిందకు దించాలా అనే ప్రయత్నం ప్రతీ ఒక్కరూ చేస్తుంటారు. వయసు పెరిగి వృద్ధాప్యం రావాలని ఎవ్వరూ అనుకోరు. మీరెంత అనుకున్నా కాలం ముందుకు వెళ్తూనే ఉంటుంది. వయసవుతూనే ఉంటుంది. ఐతే వయసు ఎంత పెరుగుతున్నా చూడడానికి ఇంకా యవ్వనంలోనే ఉన్నామన్నట్టు కనిపించడానికి కొన్ని పద్దతులు పాటిస్తే సరిపోతుంది. ఆ పద్దతులేమిటో ఇక్కడ తెలుసుకుందాం.

నవ్వండి

అవును మీరు చదివింది కరెక్టే. నవ్వుతున్న ముఖాలు యవ్వనంగా కనిపిస్తాయి. ఒకానొక పరిశోధన ప్రకారం నవ్వుతున్న ఫోటోల్లోని మోడల్స్ వారి నిజమైన వయసు కంటే తక్కువగా కనిపిస్తే, సీరియస్ గా చూస్తున్న వారు, నిజమైన వయసు కంటే ఎక్కువ వయసువారిగా అనిపించారట.

ద్రాక్ష, ఆకు కూరలు, టమాట

ద్రాక్ష చర్మానికి కావాల్సిన తేమని అందిస్తుంది. ఆకు కూరల్లో ఉండే కే విటమిన్ చర్మాన్ని వయసు పెరుగుతున్నట్టుగా కనిపించకుండా చేస్తుంది. అలాగే టమాటలో ఉండే లైకోపీన్ యవ్వనంగా కనిపించడంలో సాయపడుతుంది.

మీ ముఖాన్ని బాగు చేసుకోండి.

ముఖం చూడగానే కళ్ళు అట్రాక్ట్ చేస్తాయి. అందుకే కళ్ళు మరింత అందంగా కనిపించాలంటే కనుబొమ్మల అందాన్ని పెంచాలి.

సరైన్ బాడీ లోషన్ వాడాలి

ఎవ్వరినైనా వయసు పెరుగుతున్నట్లు గుర్తించాలంటే వారి చేతులని చూస్తే సరిపోతుందని చాలా మంది నమ్ముతారు. చేతివేళ్ళు వయసు పెరుగుతుంటే మారిపోతుంటాయి. అందుకే మీరు వాడే బాడీలోషన్ సరైనదై ఉండాలి.

మేకప్ తక్కువగా వేసుకోండి

అతిగా మేకప్ వేసుకుంటే ఆ రసాయనాలు చర్మం మీద ఎక్కువ సేపు ఉండి చర్మం పాడయ్యేలా చేస్తాయి. అందుకే ఎప్పుడైనా మేకప్ తక్కువ వేసుకోవడానికి ఆసక్తి చూపించండి.

వ్యాయామం

ఎంత ఎన్ని చేసినా శారీరకంగా ఫిట్ గా ఉండడానికి వ్యాయామం ఖచ్చితంగా అవసరం. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు యవ్వనంగానూ ఉంచుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news