పూర్వం రోజుల్లో మహిళలకు త్వరగా పెళ్లి చేసేవారు. కానీ ఇప్పుడు ముందు అమ్మాయిలు చదువుకోవడం ఆ తర్వాత ఉద్యోగం చేయడం ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో చాలా మంది పెళ్లైన మహిళల్లో ఈ సందేహం తప్పక ఉంటుంది ఫ్యామిలీ ప్లానింగ్ ఏ సమయంలో చేసుకోవడం మంచిది అనేది తెలియడం లేదు. ముందు కెరియర్ వాళ్ళు బిల్డ్ చేసుకోవడం ఆ తర్వాత దీని కోసం ఆలోచించడం లాంటివి చేస్తున్నారు.
30 ఏళ్ల తర్వాత కూడా చాలా మంది ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే 30 ఏళ్ల తర్వాత కన్సీవ్ ఇవ్వడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం…. 30 ఏళ్ల తర్వాత గర్భిణి అవడం వల్ల చాలా సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇది తల్లికి, బిడ్డకు కూడా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.
సరైన వయసు కి బిడ్డ జన్మించాలని, పెద్ద వాళ్ళు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. అయితే 30 ఏళ్ల తర్వాత మహిళ గర్భిణీ అయితే నార్మల్ డెలివరీ అవడం చాలా కష్టం. అదే ఒకవేళ 35 ఏళ్ల తర్వాత ప్లాన్ చేసుకున్నట్లయితే ఫీటస్ సరిగ్గా డెవలప్ అవ్వదు. అది ఒకవేళ చిన్నగా ఉండడం లేదా పెద్దగా ఉండడం లాంటి సమస్యలు వస్తాయి.
ఒకవేళ 35 ఏళ్ల తర్వాత శిశువుకి జన్మనిస్తే అప్పుడు ఎక్కువగా మిస్ క్యారేజ్ అవుతుందని… హై బీపీ, షుగర్ సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు. ఎంత తక్కువ వయసులో ప్రెగ్నెంట్ అయితే అంత ఆరోగ్యకరమని దీని వల్ల జన్మించిన శిశువు కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు. మీరు కనుక ఒకవేళ 25 ఏళ్లకు వివాహం చేసుకున్నట్లయితే వివాహమైన వెంటనే మీరు కనడం మంచిది.