ఘీ-కాఫీ (నెయ్యి కాఫీ) గురించి తెలుసా?

-

ఒకప్పుడు కాఫీ అంటే ఒకటే కదా అనుకునేవాళ్లు. ఇప్పుడు కాఫీ అంటే ఏ కాఫీ కావాలని అడుగుతున్నారు. కాఫీలో అన్ని రకాలు వచ్చేశాయి మరి. అంతటితో ఆగకుండా వాటిమీద ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. బ్లాక్ కాఫీ, కాశ్మీర్ కాఫీలానే నెయ్యి కాఫీ కూడా ఉంది. నెయ్యితో చేసిన కాఫీతాగితే ఫ్యాట్ కదా అనుకోకండి. దీంతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో చూద్దాం.

వెన్నని కాచిన తర్వాత వచ్చే పదార్థాన్ని నెయ్యిగా పరిగణిస్తారని అందరికీ తెలుసు. ఇది ఇప్పటిది కాదు. పురాతన కాలం నుంచి వస్తున్నదే. నెయ్యి కొంతభాగాన్ని కాఫీలో కలిపినప్పుడు, బరువు తగ్గడంలో సహాయపడడంతోపాటు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాల శ్రేణి కలిగి ఉన్నట్లుగా చెప్పబడుతుంది. ఘీ కాపీ అనేది బట్టర్ కాపీ కన్నా అత్యంత తియ్యగా ఉంటుంది.

ప్రయోజనాలు :
కడుపుతో ఆమ్ల ప్రభావాన్ని తగ్గిస్తుంది :
కొంతమంది పరగడుపున కాఫీ తాగుతారు. కొంతమంది ఏదైనా తిన్నతర్వాత తాగుతారు. ఆమ్ల ప్రభావానికి గురవుతున్న కారణాన, అనేక మందికి ఖాళీ కడుపుతో కాఫీ తాగడం చాలా కష్టంగా ఉంటుంది. కాఫీలో కొంత నెయ్యిని జోడించడం వల్ల ఆమ్లతత్వం, కడుపులో మంట తగ్గుతుంది. ఎందుకంటే ఇందులో బ్యుటిరిక్ యాసిడ్, ఒమేగా 3 కొవ్వుఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది :
బరువు తగ్గడానికి మీరు కీటో డైట్ పాటిస్తూ ఉంటే ఉదయాన్నే ఘీ-కాఫీ తీసుకోవడం మంచిది. మీ శరీరం కీటోసిస్‌లో లేకుంటే మీరు నెయ్యి కాఫీ తాగుతుంటే మాత్రం మీరు బరువుని నియంత్రించుకోవచ్చు. అంతేకాదు కాఫీ మానసిక సంతృప్తిని అదుపులో ఉంచుతుంది మరియు నియంత్రిస్తుంది.

మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది :
నెయ్యిలో ఓమెగా 3 కొవ్వుఆమ్లాలు ఉన్న కారణంగా నాడీ కణజాలాల పెరుగుదలకు, పనితీరుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా హార్మోన్ల ఉత్పత్తిని కూడా మెరుగుపరుస్తుంది.

లాక్టోస్-టోలరెన్స్(అసహనం) ఉన్నవారికి మంచిది :
చాలామందికి ఓపిక తక్కువగా ఉంటుంది. మాటిమాటికి విసుగు తెచ్చుకుంటారు. ఏదైనా పనిలో కొంచెం లేట్ అయినా వారు అసహనం కోల్పోతారు. అలాంటి వారికి ఘీ-కాఫీ ఉపమోగపడుతుంది. నెయ్యి పాలలోని ఘనపదార్థాలు, ప్రోటీన్ల నుంచి వేరు చేయబడిన పదార్థంగా ఉంటుంది. వెన్నతో పోలిస్తే నెయ్యి కడుపులో ఆమ్ల ఘాడతను తక్కువగా కలిగి ఉంటుంది.

ఘీ-కాఫీ రెసిపీ తయారీ :
కాఫీ తయారు చేసి కప్పులో పోసుకోవాలి. 1 లేదా 2 టీస్పూన్లు (కాఫీ క్వాంటిటీ బట్టి) నెయ్యిని జోడించాలి. దీన్ని బాగా కలియబెట్టి తాగాలి.

Read more RELATED
Recommended to you

Latest news