సబ్జా గింజల నీళ్లు తాగడమే కాదు..ఈ అద్భుత ప్రయోజనాలు తెలిస్తే షాక్‌..

-

ఎండాకాలం వచ్చిందంటే.. బాడీలో హీట్ అమాంతం పెరుగుతుంది. అందరూ బాడీకి చలవ చేసే వాటిని తినటానికి ప్రాధాన్యం ఇస్తారు. చలవ చేసే వాటిల్లో మొదటిది సబ్జా గింజలు. వీటినే…తుక్మారియా లేదా తులసి గింజలు అని కూడా పిలుస్తారు. ఇవి అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. సబ్జా గింజల్లో ప్రోటీన్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు, పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తక్కువ కేలరీలు ఉంటాయి. ఈరోజు సబ్జా గింజల ద్వారా మీకు తెలియని కొన్ని ప్రయోజనాల గురించి చూద్దాం.

షుగర్ లెవల్స్ తగ్గించడంలో.. టైప్2 డయాబెటిస్ ఉన్న రోగులకు ఇది మంచిదని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో షుగర్ లెవల్స్‌ను తగ్గించడంలో సబ్జా గింజలు అద్భుతంగా పనిచేస్తాయట.

మలబద్ధకం, కడుపు ఉబ్బరం సమస్య నుంచి ఉపశమనం.. ఈరోజుల్లో మలబద్ధకం సమస్య చాలా మందికి ఉంటుంది. సబ్జా గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల.. పొట్టప్రేగులను క్లీన్ చేసి.. సుఖవిరోచనం అయ్యేలా చేస్తుంది.

బరువు తగ్గడానికి.. సబ్జా గింజల్లో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువును తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుంది. ఇంకా ఇందులో ఫైబర్ ఉండటం వలన.. వీటిని తింటే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది.

అసిడిటీ, ఛాతిలో మంటను తగ్గిస్తుంది.. సబ్జా గింజలు శరీరంలో అమ్లత్వాన్ని తగ్గిస్తుంది. ఇది ఆమ్లత్వం, గుండెల్లో మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నానబెట్టిన గింజలను తీసుకోవడం ద్వారా కడుపులోని సమస్యలను క్లియర్ చేస్తుంది. తద్వారా కడుపులో మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

చర్మం, జుట్టుకు ఆరోగ్యం.. కొబ్బరి నూనెలో పిండిచేసిన సబ్జా గింజలను కలిపి.. ఆ నూనెను ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయడం ద్వారా ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులను నయం చేయడంలో బ్రహ్మాండంగా పని చేస్తుందట.

సబ్జా విత్తనాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొత్త చర్మ కణాలను రూపొందించడానికి అవసరమైన కొల్లాజెన్‌ను స్రవించడంలో మీ శరీరానికి సహాయపడుతుంది. సబ్జా గింజలు పొడవాటి, దృఢమైన జుట్టుకు అవసరమైన ఐరన్, విటమిన్ కె, ప్రొటీన్‌తో నిండి ఉండటంతో.జుట్టు ఆరోగ్యానికి బాగా మంచిది.

దగ్గు, జలుబు.. సబ్జా గింజల్లో యాంటిస్పాస్మోడిక్ లక్షణాలున్నాయి. ఇది కండరాల సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కండరాలకు విశ్రాంతినిస్తాయి. యాంటిస్పాస్మోడిక్ లక్షణం.. కోరింత దగ్గును నియంత్రించడంలో అద్భుతంగా పని చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news