ఫైబర్ మాక్సింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!

-

పూర్తి ఆరోగ్యం కోసం ఎన్నో రకాల డైట్ లను పాటించడం సహజమే. అయితే, పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్ లు సమతుల్యంగా శరీరానికి అందే విధంగా తీసుకోవడం ఎంతో అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఫైబర్ కూడా ఆరోగ్యానికి ఎంతో అవసరం. రోజుకు కనీసం 25 నుండి 30 గ్రాముల వరకు ఫైబర్‌ను తీసుకోవాలి. పూర్తి ఆరోగ్యాన్ని పొందాలంటే ఫైబర్‌ను తగినంత తీసుకోవడం ఎంతో అవసరం అని గుర్తించాలి.

అందువల్ల ఆరోగ్య నిపుణులు ఫైబర్ మాక్సింగ్ ను పాటించాలని చెబుతున్నారు. అంటే, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను మీ డైట్‌లో చేర్చుకోవాలి. చియా గింజలు, అవిస గింజలు, క్వినోవా, మిల్లెట్, బ్రౌన్ రైస్, పియర్స్, కీరదోస, పప్పు దినుసులు, సెనగలు, బ్లాక్ బీన్స్ వంటి వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కనుక, డైట్‌లో భాగంగా కచ్చితంగా ఇటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఎప్పుడైతే ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటారో అవి శరీరానికి సరైన విధంగా అందాలంటే మంచి నీళ్లు తగినంత తీసుకోవాలి. కనుక, ఫైబర్‌తో పాటుగా మంచినీళ్లు కూడా ఎక్కువగా తాగాలి.

ఫైబర్‌ ను తగినంతగా తీసుకుంటే జీర్ణ ప్రక్రియ మెరుగ్గా పనిచేస్తుంది మరియు పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా మలబద్ధకం వంటి సమస్యలు తగ్గిపోతాయి. అంతేకాకుండా, ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించుకోవచ్చు మరియు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఫైబర్ అధికంగా తీసుకోవడం వలన కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీంతో అధిక ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. ఈ విధంగా బరువు నియంత్రణలో ఉంటుంది. కనుక ఈ ప్రయోజనాలను పొందాలంటే, కచ్చితంగా మీ ఆహారంలో ఫైబర్‌ ను ఎక్కువగా చేర్చుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news